/rtv/media/media_files/2025/02/14/hy58wQPCf0AqzNvdFHOw.jpg)
pulwama attak Photograph: (pulwama attak)
Pulwama attack: అది 40 మంది సైనికుల మరణానికి, దేశ భద్రతకు సంబంధించిన విషయం. 2019 ఫిబ్రవరి 14న భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ విషాదం చోటుచేసుకొని సరిగ్గా నేటికి ఆరేళ్లు. ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైయ్యారు. 78 వాహనాల్లో సుమారు 2500 మంది సీఆర్పీఎఫ్ జావాన్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు నేషనల్ హైవేపై వెళ్తున్నారు. సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. ఈ ఆత్మహుతి దాడికి పాల్పడింది 22ఏళ్ల ఆదిల్ అహ్మద్ దార్‌గా గుర్తించారు పోలీసులు.
సూసైడ్ బాంబర్ ప్లాన్
ఈ టెర్రర్ ఆపరేషన్ వెనుక ప్రధాన సూత్రధారి ఆఫ్ఘన్‌కి చెందిన ఘాజీ అబ్దుల్ రషీద్‌గా చెబుతున్నారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు రషీద్ అత్యంత సన్నిహితుడు. భారత్‌లో విధ్వంసానికే రషీద్‌ను మసూద్ ఇండియా పంపించినట్టు తెలిసింది. సౌత్ కశ్మీర్‌ను అడ్డాగా చేసుకున్న మసూద్.. ఐదారుగురు యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి వారిని సూసైడ్ బాంబర్లుగా మార్చాడు. పుల్వామాలో ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ కూడా ఇందులో ఒకడు. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ కూడా ప్రకటించింది.
ఏం జరిగిందంటే..
ఈ దాడి కోసం ఆదిల్ కారులో 300 కిలోల పేలుడు పదార్ధాలు పెట్టాడని దర్యాప్తులో తేలింది. అందులో 80కేజీలు ఆర్డిఎక్స్ అంట. వాటిని కారులో పెట్టుకొని పక్కా ప్లాన్‌తో జవాన్లు ప్రయాణిస్తున్న వాన్వాయ్ మధ్యలోకి వచ్చి ఓ వ్యాన్‌కు ఢీకొట్టాడు. కాన్వాయ్ వెనుక నుంచి వచ్చి 4 వ్యాన్లను క్రాస్ చేసి 5 వ్యాన్ మీద అటాక్ జరిగింది. అందులో ఉన్న 76 బెటాలియన్ సైనికులు 40 మంది దుర్మరణం చెందారు.
ప్లాన్‌లో 19 మంది నిందితులు
ఈ కేసు దర్యాప్తు చేసిన 12 మంది NIA సభ్యుల టీం ఆగస్టు 2020లో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో 19 మంది నిందితులు ఇందులో ఉన్నారని తేల్చారు. ఆగస్టు 2021 నాటికి ఇండియన్ ఆర్మీ ప్రధాన నిందితుడు సైఫుల్లాతో సహా ఏడుగురిని హతమార్చగా, మరో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇంత మొత్తంలో పేలుడు పదార్థాలు పాక్ నుంచి భారత్‌లోకి తేవడం సాధ్యం కాదని ఆర్మీ అధికారులు అన్నారు. అయితే ఆ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి ఇండియాకు వచ్చాయని, తీవ్రవాదుల చేతికి ఎలా దొరికాయన దర్యాప్తులో తెలియలేదు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ''రేవంత్ కు బిగ్ షాక్.. ఆ 25 ఎమ్మెల్యేలు జంప్''
ఇండియా రివేంజ్
పుల్వామా అటాక్‌కు రివేంజ్‌గా పాక్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను అందుకోసం రంగంలోకి దింపారు. 12 మిరాజ్ 2000 జెట్‌లు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు వర్షం కురిపించాయి. జైష్-ఎ-మొహమ్మద్ శిక్షణా శిబిరంపై దాడి చేసి దాదాపు 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారతదేశం ప్రకటించింది. ఇండయన్ ఎయిర్ ఫోర్స్‌కు ధీటుగా పాక్ కూడా జెట్ విమానాలను పంపింది. భారత, పాకిస్తాన్ జెట్ల మధ్య జరిగిన డాగ్‌ఫైట్‌లో ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 పాకిస్తాన్‌పై కూలిపోయి దాని పైలట్ పట్టుబడ్డాడు. పాకిస్తాన్ మార్చి 1న పైలట్‌ను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: BC Reservations : వాళ్లకోసమే మరోసారి సర్వే.. మంత్రి పొన్నం క్లారిటీ
పాకిస్థాన్ అరెస్టులు
పాకిస్థాన్ బార్డర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత్ చేసిన ఆరోపణలో భాగంగా.. పాకిస్థాన్ మార్చి 5న పాకిస్తాన్ జైష్-ఎ-ముహమ్మద్ సహా వివిధ గ్రూపులకు చెందిన 44 మంది సభ్యులను అరెస్టు చేసింది. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌కు ఇచ్చిన పత్రంలో అరెస్టయిన వారిలో కొందరి పేర్లను భారతదేశం పేర్కొంది. అరెస్టు చేసిన వారిని కనీసం 14 రోజులు నిర్బంధంలో ఉంచుతామని, ఇండియా ఆధారాలు అందిస్తే వారిపై విచారణ చేపడతామని పాకిస్తాన్ తెలిపింది. అరెస్టు అయిన వారిలో జెఎమ్ నాయకుడు మసూద్ అజార్ బంధువులు ఉన్నారు , అతని కుమారుడు హమద్ అజార్, అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్ కూడా ఉన్నారు.