/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు బెంగళూరులోని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు దుబాయ్ నుంచి ఎంత బంగారాన్ని తీసుకురావొచ్చు, ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడు దీనిగురించే పూర్తిగా తెలుసుకుందాం. వాస్తవానికి భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. ఇందుకు కారణం అక్కడ తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటం, అలాగే జీఎస్టీ లేకపోవడం.
Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్ షాక్.. రావడం కష్టమే
అయితే విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నిర్ణయించిన నియమాలు తప్పకుండా పాటించాలి. లేకపోతే పోలీసులు చేతిలో అరెస్టు కావాల్సి వస్తుంది. విదేశాల నుంచి భారత్‌కు బంగారం తీసుకురావంటే ముందుగా దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం ఈ పన్ను 6 శాతం ఉంది. ఇది కట్టకుండా తప్పించుకునేందుకే చాలామంది అక్రమంగా బంగారాన్ని విదేశాల నుంచి భారత్‌కు తీసుకొస్తుంటారు.
Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్
CBIC రూల్స్ ప్రకారం దుబాయ్‌లో ఆరు నెలల కంటే ఎక్కువ ఉండి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన వాళ్లు ఒక కేజీ వరకు బంగారం తీసుకురావచ్చు. ఒకవేళ అంతకన్న ఎక్కువ బంగారం తీసుకురావాలంటే కూడా ట్యాక్స్ చెల్లించిన బంగారం నిరూపించుకొని తీసుకురావచ్చు. అయితే పురుషులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే 20 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. మహిళలు 40 గ్రాముల వరకు తీసుకురావచ్చు. కానీ ఈ బంగారం గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో ఉండాలి. 15 ఏళ్ల లోపు పిల్లలకు 40 గ్రాముల వరకు పరిమితి ఉంది. వీళ్ల కోసం కొనే బంగారం నగలు, గిప్ట్స్ రూపంలో ఉండాలి. అలాగే కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయంలో బంగారం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలను చూపించాలి. పిల్లలకు అయితే తల్లిదండ్రులు లేదా గార్డియెన్లకు సంబంధించిన ఐడీ కార్డు ఉండాల్సి ఉంటుంది. \
Also Read: దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో సోదాలు.. భారీగా అక్రమాలు?