/rtv/media/media_files/2026/04/16/amith-sha-2026-04-16-19-09-42.jpg)
amith sha
Delimitation : నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) పై లోక్ సభలో వాడివేడి చర్చ సాగుతోంది. డీ లిమిటేషన్ మూలంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిజానికి ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ రోజు లోక్‍సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్‍తో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లోక్‍సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని వెల్లడించారు, అలాగే ఆంధ్రప్రదేశ్‍లో లోక్‍సభ సీట్లు 25 నుంచి 38 కి పెరుగుతాయని వివరించారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని మిగిలిన తమిళనాడు, కర్నాటకలోనూ సీట్లు పెరుగుతాయని ఆయన వివరించారు.
అమిత్ షా చెప్పినదాన్ని బట్టి కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయి. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని అమిత్ షా పేర్కొన్నారు. అలాంటపుడు సౌత్‍లో ఎవరికి అన్యాయం జరుగుతుందో సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా వివరాలు చెబుతున్నామని ఆయన వివరించారు. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయని వెల్లడించారు. జనరల్ సీట్లలోనూ మహిళలకు అవకాశం ఇస్తే మహిళా ఎంపీల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జనాభా లెక్కలతోనే కులగణన చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ సంబంధిత బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా అమిత్ షా ఈ వివరాలు వెల్లడించారు.
Follow Us