డీకే శివకుమార్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్ నుంచే తీవ్ర విమర్శలు

శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. దీంతో డీకేపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ అంటే ఆయనకు గౌరవం లేదని మండిపడుతున్నారు.

New Update
DK Shiva Kumar

DK Shiva Kumar

శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఆయన అక్కడ వెళ్లడం.. కాంగ్రెస్‌ పార్టీలో వేడి పుట్టిస్తోంది. డీకేపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావాజాలాన్ని వ్యతిరేకించే రాహుల్‌ గాంధీ అంటే ఆయనకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే బీజేపీలో చేరేందుకు ఏమైన ప్రయత్నాలు చేస్తున్నారా ? అనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. 

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

అంతేకాదు తాజాగా కర్ణాటక బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. డీకే శివకుమార్‌ మరో ఏక్‌నాథ్ షిండే కానున్నారని వ్యాఖ్యానించింది. దీంతో ఇది మరింత దుమారం రేపుతోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ఏర్పాటుకు కారణమైన షిండే అంశాన్ని బీజేపీ నేత ఆర్ అశోక గుర్తుచేశారు. అదే బాటలో డీకే శివకుమార్‌ కూడా కాంగ్రెస్‌ను చీల్చుతారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నేతగా ఉన్న డీకే.. రాష్ట్రంలో పార్టీని కూలుస్తారంటూ వ్యాఖ్యనించారు. 

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

మరోవైపు బీజేపీ చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌ కూడా స్పందించారు. ఇది బీజేపీ చేస్తు్న్న గేమ్‌ ప్లాన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ వాదినేనని.. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లనని తేల్చి చెప్పారు. 2028 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసమే కృషి చేస్తానని స్పష్టం చేశారు. 

Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

Also Read: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు