/rtv/media/media_files/2024/12/05/2jsurrdDcpMqb2APLC85.jpg)
మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న దాని మీద దాదాపు పదిరోజుల పాటూ ఉత్కంఠత కొనసాగింది. ఎట్టకేలకు దానికి తెరపడి ఈరోజు దేవంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్ శిండేబఎన్సీపీ అధినేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ముందు నుంచీ గోల చేస్తున్న శిండే ప్రమాణ స్వీకారం సయంలో కూడా అందరినీ కాసేపు టెన్షన్ పెట్టరు. ప్రమాణం చేసేటప్పుడు గవర్నర్ చెప్పింది కాకుండా తన సొంత ప్రసంగం చదివారు. దీంతో స్టేజ్ మీద కూర్చున్న ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటూ మహాయుతి నేతలందరూ షాక్ అయ్యారు.
నా ఇష్టం..నా స్క్రిప్టే చదువుతాను..
నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరిస్తూ.. హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు.. అలాగే, ప్రధాని మోడీ బలమైన నాయకత్వంలో.. హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో పాటు మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల సపోర్టుతో అని శిండే ప్రసంగం చేశారు. ఇదివిన్న అక్కడ అందరూ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయారు. అయితే ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ రాధాకృష్ణన్...శిండేను మధ్యలోనే ఆపించి..రాజ్యాంగబద్ధంగా మళ్ళీ ప్రమాణం చేయించడంతో అందతా సద్దుమణిగింది. దీని తర్వాత నేను.. అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేశారు. అయితే, ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చెల్లినప్పటికీ ప్రోటోకాల్‌ను ఆయన పాటించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Also Read: తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
#WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw
— ANI (@ANI) December 5, 2024
Also Read: Cricket: ఐసీసీ ట్రోఫీపై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధత
Also Read: చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ