Delhi: ఢిల్లీలో లక్షకు పైగా సీసీ కెమెరాలు తొలగింపు.. ఎందుకో తెలుసా ?

దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ హయాంలో నగరవ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాలను తొలగించనుంది.

New Update
Delhi To Replace Over 1 Lakh Chinese CCTV Cameras Over Security Concerns

Delhi To Replace Over 1 Lakh Chinese CCTV Cameras Over Security Concerns

దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ హయాంలో నగరవ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాలను తొలగించనుంది. వీటివల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే రేఖా గుప్తా సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. ఈ సీసీ కెమెరాలను దశలవారిగా తొలగించే ప్రక్రియను ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. 

చైనా సీసీకెమెరాలే

ఢిల్లీలో మొత్తం రెండు దశల్లో 2,74,389 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఇందులో 2020 సెప్టెంబర్ నుంచి 2022 నవంబర్ దాకా 1.40 లక్షల కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2025 జూన్ నుంచి 2026 మార్చి వరకు 1,34,389 కెమెరాలు అమర్చారు. అయితే మొదటి దశలో ఇన్‌స్టాల్ చేసిన కెమెరాలు అన్నీ కూడా చైనా కంపెనీ హిక్‌విజన్‌కు చెందినవే. అయితే ఈ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన ఫిర్యాదులు, ఆందోళనలు ఉన్నాయి. దీంతో సున్నితమైన సమాచారం పరాయి దేశాల చేతుల్లోకి వెళ్లే ముప్పు ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే వీటిని వెంటనే తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా సురక్షితమైన వాటిని తీసుకురావాలని నిర్ణయించింది. 

Also Read: ఇరాన్ ప్రభుత్వంలో చీలికలు.. అధ్యక్షుడిని పక్కనపెట్టి పగ్గాలు చేపట్టిన IRGC

దీనికి సంబంధించి మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీవ్యాప్తంగా చైనాకు చెందిన కెమెరాలు ఏర్పాటు చేసేటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దీర్ఘకాలక భద్రతా ప్రమాణాలను పరిగణలోని తీసుకోలేదని విమర్శించారు. నిఘా అంటే కేవలం ప్రదర్శన కోసం పెట్టేది కాదని.. సున్నితమైన డేటా నియంత్రణకు సంబంధించినదని పేర్కొన్నారు. ఇది జాతీయ భద్రతపై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపారు. ఆప్ దీన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యిందంటూ మండిపడ్డారు. 

ప్రస్తుతానికి మొదటి దశలో భాగంగా 50 వేల చైనా కెమెరాలు మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ సీసీటీవీ కెమెరా భర్తీ వల్ల నగర నిఘా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా దశలవారిగా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఉన్నత ప్రమాణాలతో, డేటా భద్రతకు హామీ ఇచ్చే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 

Also Read: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

Advertisment
తాజా కథనాలు