/rtv/media/media_files/2025/02/16/AgkYspqGGxLkfupFF2Cw.jpg)
New Chief Minister of Delhi Likely To Be Picked Tomorrow
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. కొత్త సీఎం ఎవరు, ప్రమాణస్వీకారం ఎప్పుడుంటుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మొత్తానికి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార ముహుర్తం మాత్రం ఖరారైంది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4.30 గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read: 'చైనాను శుత్రువులా చూడటం ఆపండి'.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత సీఎం రేసులో విజయేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ తదితరులు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే పూర్వాంచల్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.
Also Read: పాపం పెళ్లి కొడుకు.. బంగారం, రూ.3.5 లక్షలతో పెళ్లి కూతురు జంప్.. ఎక్కడంటే..!?
మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇదే ఫార్ములాను పాటించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో గెలిచి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేకపోయింది. వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం ఇచ్చిన ఢిల్లీ ప్రజలు ఈసారి మాత్రం కమలం పార్టీకే అధికార పగ్గాలు అప్పగించారు. మొత్తానికి ఎప్పటినుంచో దేశరాజధానిలో అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ కల ఇప్పటికీ నెరవేరింది.
Also Read: బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!