/rtv/media/media_files/2025/02/13/CIbbXfMRJVIEQpnxOul7.jpg)
Delhi CM Announcement Likely on Sunday
Delhi CM: ఢిల్లీ సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ(BJP) హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష నేతల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ భేటిలో పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఇద్దరు సీనియర్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశంలోనే తదుపరి ఢిల్లీ సీఎంను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!
మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని ఇద్దరికి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇదే ఫార్ములాను పాటించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మినీ ఇండియాను ప్రతిబింబించేలా ఢిల్లీ కొత్త కేబినెట్‌ను ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
ఢిల్లీ సీఎం రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ
ఇదిలాఉండగా ఢిల్లీ సీఎం రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ(Parvesh Verma) ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో సహా విజయేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ తదితరులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే పూర్వాంచల్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 ఆయన పర్యటన ముగుస్తుంది. అయితే ప్రధాని స్వదేశానికి వచ్చిన తర్వాతే సీఎం ఎంపిక, ప్రమాణస్వీకారం జరగనుంది.
Also Read: బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?
Also Read: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్