Delhi: గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా ఢిల్లీ.. సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్లకు ఈ ప్రాంతం రాజధానిగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఇటీవలే హత్యకు గురైన యువకిడి కుటుంబాన్ని తాజాగా ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆమె విరుచుకుపడ్డారు. By B Aravind 20 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఢిల్లీ సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్లకు ఈ ప్రాంతం రాజధానిగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఇటీవలే హత్యకు గురైన యువకిడి కుటుంబాన్ని తాజాగా ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆమె విరుచుకుపడ్డారు. ఢిల్లీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సుందర్ నగరీలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను వేధిస్తున్నారని తెలుసుకొని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆ యువకులను మందలించారు. Also Read: జార్ఖండ్‌లో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్ Delhi Become Gangster Capital - CM Atishi ఆ తర్వాత ఆ ఇద్దరు యువకులు కత్తులతో చేసిన దాడిలో ఓ 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో బాధిత కుటుంబాన్ని సీఎం అతిశీ పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. Also Read: మహారాష్ట్రలో గెలిచేది మహాయుతి కూటమే.. సంచలన ఎగ్జిట్ పోల్స్! ''ఢిల్లీ గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా మారింది. గూండాలు, దోపిడీదారులకు భయం లేకుండా పోయింది. ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకున్నారు. పోలీసులు ఏ చర్యలు తీసుకోలేరని ఇక్కడ రెచ్చిపోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ నుంచి ఓ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఢిల్లీ శాంతిభద్రతలు నియంత్రించే బాధ్యత తన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు ?. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. దోపిడీలు, హత్యలు పెరిగిపోతున్నాయి. అయినా కూడా అమిత్ షాకు ప్రచారం తప్ప వేరే బాధ్యతలు లేనట్లుగా అనిపిస్తోందని'' సీఎం అతిశీ అన్నారు. Also Read: శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే! Also Read: విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా.. విడాకులు పై నోరు విప్పిన రెహమాన్! #telugu-news #delhi #national-news #atishi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి