Viral News: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్‌ జేబులో డబ్బే డబ్బు!

ఢిల్లీలో నైనా అనే అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. ఫేమస్ జాన్‌పథ్ మార్కెట్‌లో కొన్న ప్యాంటులో ఊహించని ధనం అదృష్టమిచ్చింది. ఆ ప్యాంటు జేబులో ఏకంగా 10 యూరోలు ఆమెకు దొరికాయి. రెండు 5 యూరో నోట్ల ఫోటోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

New Update
Delhi Girl Finds 10 Euros Inside Pant Purchased From Janpath Market

Delhi Girl Finds 10 Euros Inside Pant Purchased From Janpath Market

అదృష్టం ఎవరిని ఎప్పుడు, ఎలా తడుతుందో తెలియదు. ఊహించని విధంగా కొందరు కోటీశ్వరులవుతారు. అలాంటిదే తాజాగా జరిగింది. అదృష్టం అయితే తట్టింది కానీ.. అందరూ ఊహించినంత పెద్ద లక్కు అయితే కాదు. నైనా అనే అమ్మాయి ఢిల్లీలోని ఫేమస్ జాన్‌పథ్ మార్కెట్‌కి వెళ్లింది. ఆ మార్కెట్‌లో చాలా చీప్ ధరకే బట్టలు దొరుకుతాయి. 

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

ప్యాంట్ జేబులో డబ్బులు

జాన్ పథ్‌లోని సరోజినీ నగర్ మార్కెట్‌లో అతి తక్కువ ధరకే పురుషులు, స్త్రీలకు సంబంధించిన బట్టలు దొరుకుతాయి. అక్కడకు వెళ్లింది నైనా అమ్మాయి. అక్కడ తనకు నచ్చిన ప్యాంట్స్ కొని ఇంటికి తీసుకెళ్లింది. త్వరగా ప్యాంట్ వేసుకోవాలని చూసింది. అదే సమయంలో ప్యాంట్ జేబులో చేయిపెట్టి చూసింది. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

అలా చూడగా.. ఇక్కసారిగా ఆమె చేతికి ఏవో పేపర్లు తగిలినట్లు అనిపించింది. వెంటనే ఆమె తన చేతికి తగిలిన వాటిని జేబులోంచి బయటకు తీసి చూసింది.  ఒక్కసారిగా అవాక్కైంది. ఊహించని ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆ జేబులో రెండు 5 యూరో నోట్లు కనిపించాయి. అంటే మొత్తం 10 యూరోలు. భారత కరెన్సీ ప్రకారం.. రూ.929. అందుకు సంబంధించి నైనా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. 

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఏకంగా 3 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే.. రియల్ లైఫ్ క్యాష్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆ బట్టలు ఎక్కడ నుంచి వచ్చి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్‌పథ్‌, సరోజినీ నగర్ వంటి చీపెస్ట్ మార్కెట్లలో యూరప్ నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు దిగుమతి అవుతాయని చాలా మంది అంటున్నారు. ఏది ఏమైనా నైనాకి ఇదొక జాక్ పాట్ అనే చెప్పాలి. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

(viral-news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nithyananda: ఏకంగా అమెజాన్‌ అడవుల మీదే పడిందా స్వామీ నీ కన్ను...నువ్వు మామూలోడివి కాదు

2019 నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా, దక్షిణ అమెరికాలోని బొలీవీయాలో అమెజాన్ అటవీ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
nityananda no more

nityananda no more

2019 నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ఆయన చనిపోయినట్టు నిత్యానంద అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, దక్షిణ అమెరికాలోని బొలీవీయాలో అమెజాన్ అటవీ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అతడి అనుచరులు భూ ఆక్రమణకు  ప్రయత్నించి... స్థానిక తెగలతో లీజుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది.

Also Read: Ap Crime: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి!

 ఈ విషయం వెలుగులోకి రావడంతో మొత్తం 21 మందిని అరెస్ట్ చేసిన బొలీవియా అధికారులు.. వీరందర్నీ వారి వారి దేశాలకు పంపించారు.భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద.. ఈక్విడార్ సమీపంలోని ఓ దీవికి కైలాస అనే పేరు పెట్టి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే.  కైలాస దేశంతో సంబంధమున్న కొందరు ఇటీవల బొలీవియాలో పర్యటించి.. కార్చిచ్చును ఎదుర్కోవడంలో స్థానికులకు సాయపడ్డారు. ఈ క్రమంలో ఆ భూములపై కన్నేసిన వీరు.. లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు  చేసుకున్నారు. 

Also Read: Gujarat: వారం క్రితమే నిశ్చితార్థం...ఇంతలోనే ప్రమాదం..కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాత్‌ జెట్‌ పైలెట్‌ మృతి!

బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్స్‌తోనూ ఫొటోలు దిగారు. చివరకు 2 లక్షల డాలర్లకు ఢిల్లీకి మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాన్ని 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి స్థానిక తెగ ప్రతినిధి ఒప్పుకున్నాడు. కానీ, నిత్యానంద ప్రతినిధులు మాత్రం వెయ్యేళ్లు లీజుతో పాటు గగనతల వినియోగం, సహజవనరులు, గనుల తవ్వకాలు వంటి ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బొలీవియా వార్త పత్రిక ఒకటి ఇన్వెస్టిగేషన్ కథనం ప్రచురించడంతో నిత్యానంద కుట్ర బయటపడింది. 

దీంతో అప్రమత్తమైన లూయిస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కైలాసతో సంబంధమున్న 21 మందిని అదుపులోకి తీసుకుంది. వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి.. సంబంధిత వ్యక్తులను వారివారి దేశాలకు పంపేసింది. పర్యటకులుగా పలుసార్లు బొలీవియాకు వచ్చిన వీరు.. స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. గతేడాది నవంబరు నుంచి కొందరు అక్కడే ఉండిపోయినట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బొలివియా విదేశాంగ మంత్రి  మాట్లాడుతూ.. వివాదాస్పద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

నిత్యానంద కైలాస ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్న తెగ నాయకుడు పెడ్రో గ్వాసికో మాట్లాడుతూ... 2024 చివరిలోనే భూముల లీజు గురించి తమను సంప్రదించారని తెలిపారు. కార్చిచ్చు ఆర్పేందుకు సాయం చేసినట్టే చేసి.. లీజు గురించి ప్రస్తావన తీసుకొచ్చారని చెప్పారు. ‘‘మేము వారి మాటలు విని మోసపోయాం.. మా భూమిని తీసుకుని ఏడాదికి కొంత మొత్తం ఇస్తామని ఆశ చూపించారు. కానీ అది పూర్తిగా తప్పు’’ అని తెలిపారు.

Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్..  !

Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

nithyananda swami | swamy nityananda | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment