/rtv/media/media_files/2025/02/08/MHBNMohK7rkydU8vyJ21.jpg)
counting
Delhi Elections Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం12 గంటల వరకు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎన్నికల. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రతి కేంద్రంలో రెండు పారామిలిటరీ దళ బలగాలను మోహరించారు.
Also Read: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
మేజిక్ ఫిగర్ 36
కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఓటింగ్ జరగగా.. మొత్తం 60.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 60.92% ఓటు వేయగా.. పురుషులు 60.21% మంది ఓటు వేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందా లేదా 27 ఏళ్ల దేశరాజధానిలో బీజేపీ జెండా ఎగురుతుందా అన్నది చూడాలి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మేజిక్ ఫిగర్ 36. 2013లో కాంగ్రెస్ తో పొత్తుతో అధికారంలోకి వచ్చిన ఆప్.. 2015, 20 అసెంబ్లీ ఎన్నికల్లో 60కి పైగా సీట్లు సాధించింది. 2025 ఎన్ని్కల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 699 మంది ఈ సారి బరిలో నిలిచారు. ఆప్, కాంగ్రెస్ మొత్తం 70 స్థానాల్లో, బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఒక సీటు జెడియుకి, ఒక సీటు ఎల్జెపి (ఆర్)కి ఇచ్చాయి.
ఇది సాధారణ ఎన్నికలు కాదని, మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అభ్యర్థి కల్కాజీ అతిషి అన్నారు. ఢిల్లీ ప్రజలు మంచితనం, ఆప్, అరవింద్ కేజ్రీవాల్ పక్షాన నిలబడతారని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Delhi Elections Live Updates: ఢిల్లీలో గెలిచేదెవరు..? కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!