Delhi Elections 2025: సున్నాలో కాంగ్రెస్ హ్యాట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో హ్యాట్రిక్ సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో కొన్ని రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సాధించకపోవడంతో ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

New Update
 Congress Protest on Budget

Congress Protest on Budget

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. వరుసగా మూడో సారి కాంగ్రెస్ పార్టీకి సున్నా వచ్చింది. 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు గెలిచింది. కానీ ఇప్పుడు కనీసం ఖాతా కూడా తెరవడం లేదు. దీంతో సున్నాలో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టిందని నెట్టింట తెగ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు గుండు సున్నా సాధించడంతో సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్..

ఢిల్లీ ప్రజలు కమలం పార్టీని నీటిలో నుంచి పైకి తీసుకొచ్చి.. ఆప్‌ని సగం ముంచేశారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పాతాళానికి తొక్కేశారనే మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా హాయిగా రిజల్ట్ చూడవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ ఒక గట్టు మీద కూర్చోని చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!

ఇది కూడా చూడండి:Delhi Assembly Results: ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు..నేడే అసెంబ్లీ ఫలితాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment