/rtv/media/media_files/2025/03/11/EP7vfWFJKyCMBSOJWHXa.jpg)
Arvind Kejriwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా మరో ఎదురుబెద్ద తగిలింది. 2019లో ద్వారకలో భారీ హోర్టింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు.
Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్ కీలక ఆదేశం
దీంతో పిటిషనర్ చేసిన అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు అంగీకారం తెలిపింది. అయితే ప్రజల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2020లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ ఫిర్యాదును తోసిపుచ్చారు. దిగువ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సెషన్ కోర్టు కొట్టివేసింది. ఫిర్యాదును మళ్లీ పరిశీలించడం కోసం వెనక్కి పంపింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదిలాఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 27 తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే న్యూఢిల్లీ స్థానం నుంచి పోటిచేసిన కేజ్రీవాల్ కూడా ఈసారి ఓడిపోయారు. లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులు, కోట్ల ఖర్చుతో సీఎం నివాసాన్ని లగ్జరీగా నిర్మించడం లాంటి అంశాలన్నీ ఆప్‌పై ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. అధికారం పోవడంతో కేజ్రీవాల్ ఇప్పుడు మరిన్ని సమస్యల్లో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: డంకీరూట్ లో మరో ఇండియన్ మృతి..అక్కడే భార్య బిడ్డలు!
Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !