Delhi: ఢిల్లీలో వర్క్‌ ఫ్రం హెం.. సీఎం రేఖా గుప్తా 10 కీలక ప్రకటనలు

దేశంలో ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం కూడా వర్క్‌ ఫ్రం హోం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె 10 కీలక ప్రకటనలు చేశారు. 

New Update
Delhi CM Rekha Gupta announces 2 days' WFH for government offices, metro use by ministers

Delhi CM Rekha Gupta announces 2 days' WFH for government offices, metro use by ministers


దేశంలో ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం కూడా వర్క్‌ ఫ్రం హోం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది వారానికి రెండ్రోజులు ఇంటి నుంచే పనిచేస్తారని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ప్రవేటు సంస్థలు కూడా ఇదే పద్ధతిని పాటించాలని కోరారు. అలాగే తన కాన్వాయ్‌ను కూడా  నాలుగు వాహనాలకే పరిమితం చేశామని.. అందులో రెండు ఈవీ వాహనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే వారానికి ఓసారి 'నో వెహికల్ డే'ను పాటించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె 10 కీలక ప్రకటనలు చేశారు. 

1. ఇంటి నుండి పని
 అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ప్రతి వారం రెండ్రోజుల పాటు ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలకు కూడా ఇదే విధమైన సలహా జారీ.

2. ఇంధన కోటా తగ్గింపు
 ప్రభుత్వ అధికారుల పెట్రోల్, డీజిల్ పరిమితులను 20 శాతం తగ్గింపు. ఉద్యోగుల రవాణా భత్యాన్ని 10 శాతం పెంచనున్నాం.

3. సోమవారం మెట్రో
 ప్రతి సోమవారం "మెట్రో సోమవారం"గా ఉంటుంది. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణించాలి. ప్రభుత్వ అధికారులను వాళ్ల కాలనీల నుంచి మెట్రో స్టేషన్‌కు చేర్చేందుకు బస్సులను అందుబాటులో ఉంచుతారు.

4. ఆన్‌లైన్‌లో మీటింగ్స్‌ 
అన్ని సమావేశాల్లో 50 శాతం ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. విశ్వవిద్యాలయాలు ప్రాక్టికల్ కాని తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. కోర్టులు కూడా వీలైనన్ని ఎక్కువ కేసులు ఆన్‌లైన్‌లోనే విచారించాలి.

5. విదేశీ ప్రయాణాలపై నిషేధం
 రాబోయే ఓ సంవత్సరం పాటు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రి గానీ, అధికారి గానీ అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లరు. 

6. ప్రధాన కార్యక్రమాలు ఉండవు
 ప్రభుత్వం రాబోయే మూడు నెలల పాటు ఎలాంటి ప్రధాన బహిరంగ కార్యక్రమాలను నిర్వహించదు. 

7.వాహనాల కొనుగోలుపై నిషేధం
 ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 6 నెలల పాటు కొత్త పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయదు.

8.మేడ్ ఇన్ ఇండియా ప్రచారం
 ఢిల్లీ ప్రభుత్వం 100 శాతం "మేడ్ ఇన్ ఇండియా" ఉత్పత్తులను మాత్రమే వాడుతుంది. అన్ని మాల్స్‌లో ప్రత్యేక "మేడ్ ఇన్ ఇండియా" కార్నర్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ కొనుగోళ్లలో స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఉంటుంది. 

9.ఏసీ పరిమితులు
 అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేయబడతాయి. విద్యుత్ వృధాను నివారించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో "మాస్టర్ స్విచ్‌లు" ఏర్పాటు.

10.ప్రజా భాగస్వామ్యం
ఈ అవగాహన కల్పించేందుకు 90 రోజుల ప్రచార కార్యక్రమం ఉంటుంది. పొదుపును ప్రోత్సహించడానికి. దేశ నిర్మాణానికి తోడ్పడటానికి పౌరులచే ప్రమాణం చేయిస్తారు. 

Advertisment
తాజా కథనాలు