/rtv/media/media_files/2025/03/06/KBohAkxotRXi3HrcELDO.jpg)
Air India flight returns to Chicago due to technical issue
ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందులో టాయిలెట్లు మూసుకుపోయాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఈ సమస్య వచ్చింది. దాదాపు 10 గంటల పాటు ప్రయాణించిన అనంతరం తిరిగి ఆ విమానాన్ని షికాగోకు మళ్లించినట్లు ఆ విమానయాన సంస్థ తెలిపింది. టాయిలెట్లు మూసుకుపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియా బోయింగ్ 777----- 337 ఈఆర్ విమానం షికాగోలో ORD ఏయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. 340 సీట్లు కలిగిన ఈ విమానంలో పది టాయిలెట్లు ఉన్నాయి. విమానం టేకాఫ్ అయిన తర్వాత వీటిలో కేవలం ఒక్కటి మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు. కానీ అప్పటికే విమానం పది గంటల పాటు ప్రయాణించింది. అయినప్పటికీ కూడా విమానాన్ని మళ్లీ తిరిగి షికాగోకు తరలించారు. ఎయిరిండియా అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.
షికాగో నుంచి ఢిల్లీకి వచ్చే ఏఐ 126 ఎయిరిండియా విమానాన్ని బుధవారం సాంకేతిక కారణాలతో తిరిగి వెనక్కి పంపించినట్లు పేర్కొన్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు, సిబ్బందికి బస కల్పించామని.. వాళ్ల గమ్యస్థానం చేరేందుకు ప్రత్యమ్నాయం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే పూర్తి మొత్తాన్ని కూడా చెల్లిస్తామని.. రీషెడ్యూల్‌కు అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.
Also Read: ఆ యూనివర్సిటీలో ఆగని నిరసనలు.. రాష్ట్ర మంత్రిపై కేసు నమోదు