Delhi Assembly Elections: ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్(Exit Polls)ను ఈసీ నిషేధించింది. ఆ సమయం తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఇక ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఢిల్లీ(Delhi)లో 70 అసెంబ్లీ స్థానాలుండగా.. అందులో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 83.49 లక్షలు కాగా.. మహిళా ఓటర్లు 71.74 లక్షల మంది ఉన్నారు. ఇందులో 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 25.89 లక్షలు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 2.08 లక్షల మంది మొదటిసారిగా ఓటు వేయనున్నారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకునే ట్రాన్స్‌జెండర్లు(Transgenders) 1261 మంది ఉన్నారు.
Also Read: లోక్‌సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ..
ఇదిలాఉండగా..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ(AAP), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు పోటీపడి ప్రచారాలు నిర్వహించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హమీల వరాల జల్లులు కురిపించాయి. అయితే ఆమ్ ఆద్మీకి 55 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ప్రజలు గట్టిగా అనుకుంటే 60కి పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన చివరి ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, జంగ్‌పురా, కల్కాజీలో ఆప్ గెలవదని బీజేపీ చెబుతోందని.. కానీ ఆ స్థానాల్లో ఆప్ చారిత్రాత్మక మెజార్టీతో గెలవనుందని అన్నారు.
Also Read: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ?
ఇదిలాఉండగా స్థానిక సంస్థలు తమ ప్రీపోల్ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. కానీ 2015, 2020 ఎన్నికల కంటే ఈసారి ఆప్‌నకు సీట్లు తగ్గనున్నట్లు తమ సర్వేలో వెల్లడించాయి. ఆప్‌కు 38- 40 సీట్లు, బీజేపీకి 31-33, కాంగ్రెస్ 0 సీట్లు వస్తాయని ఫలోడి సత్తా బజార్ అనే సంస్థ అంచనా వేసింది. ఇక వీప్రిసైడ్ అనే మరో సంస్థ కూడా ఆప్‌కు 50-55, బీజేపీకి 15-20, కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వేలు చెప్పడం గమనార్హం. అయితే మరీ ఈసారి ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి అధికార పగ్గాలు అప్పగిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.