/rtv/media/media_files/2025/04/13/sRhf75LiyV3hcYpFdJo7.jpg)
106th Jallianwala Bagh massacre anniversary
బ్రిటీష్ వాళ్లు భారత్‌ను పాలించే రోజుల్లో అనేక పోరాటాలు జరిగాయి. ఇందులో జలియన్ వాలాబాగ్ ఘటన స్వాతంత్ర్యోమాన్ని మలుపు తిప్పింది. ఈ మరణకాండ తర్వాత దేశమంతా రగిలిపోయింది. స్వాతంత్ర్యం కోసం నిరసనలు, ఉద్యమాలు మరింత ఉద్ధృతమయ్యాయి. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ విషాద ఘటన నేటితో 106 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు జలియన్‌వాలా బాగ్ అమరులకు నివాళులు అర్పించారు.
జలియన్ వాలాబాగ్ జరగడానికి గల కారణాలేంటి ? బ్రిటిషర్లు ఎందుకంతా క్రూరంగా ప్రవర్తించారో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యంలో మొత్తం లక్షా 96 వేల మంది సైనికులు ఉన్నారు. అందులో లక్షా పదివేల మంది పంజాబీలే ఉన్నారు. మరోవైపు సైనికుల్లో జాతీయ భావాలు చిగురిస్తున్నాయి. దేశభక్తి ఉప్పొంగుతోంది. అలాంటి పరిస్థితుల్లో సైనికులు తమపై తిరుగుబాటు చేస్తే వీళ్లని కట్టడి చేయడం కష్టమని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.
ముఖ్యంగా పంజాబ్‌లో మారుతున్న పరిస్థితులు బ్రిటిషర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయులను అణిచివేసేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలనుకున్నారు. ఫలితంగా రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సమాలోచనల్లో ఉంది. పౌరుల స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలపై దేశంలో నిరసనలు జరిగాయి. ఈ నల్లచట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు నిర్వహించారు.
Also Read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
నిరసనలు మరింత ముదిరాయి. ఇందులో భాగంగానే అమతృత్‌సర్‌లో కూడా నిరసనలు చేపట్టారు. ఇద్దరు సీనియర్ నాయకులను అరెస్టు చేయడంతో అమృత్‌సర్ ప్రాంతమంతా ఆగ్రహంతో ఊగిపోయింది. కత్రా జైమల్ సింగ్, హాల్ బజార్, ఉఛాపుల్ ప్రాంతాలలో 20,000 మంది ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
ఒకటి రెండు హింసాత్మక ఘటనల వల్ల పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఒ డయ్యార్ స్పందించాడు. పరిస్థితిని నియంత్రించడం కోసం జలంధర్‌లో ఉన్న సైనికాధికారి జనరల్ ఆర్.డయ్యార్‌కు కబురుపెట్టాడు. అయితే సమాచార లోపం వల్ల ప్రజలు పెద్దఎత్తున జలియన్ వాలాబాగ్‌కు వచ్చారు. అదేరోజున పంజాబీలకు పెద్ద పండుగైన వైశాఖీ ఉంది. శ్రీ హర్మిందర్ సాహిబ్‌లో దైవప్రార్థనలకు వచ్చిన వాళ్లు తోటలో చేరారు. మరోవైపు గోవిందగఢ్ పశు మేళాకు వచ్చిన వాళ్లు కూడా ఇక్కడే ఉన్నారు. పలువురు గూఢచారులు జలియన్ వాలా బాగ్ లోపల ఏం జరుగుతుందో జనరల్ ఆర్ డయ్యార్‌కు సమాచారం అందిస్తున్నారు.
జలియన్ వాలా బాగ్‌లో సత్యాగ్రహుల సమావేశం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 3 గంటలకే జనాలు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి 5.15 నిమిషాల మధ్య పాతికేసి సైనికులతో కూడిన నాలుగు సైనిక బృందాలతో డయ్యార్ జలియన్ వాలా బాగ్‌కు వచ్చాడు. ఈ బృందాల్లో 50 మంది సైనికులు గూర్ఖా రెజిమెంట్‌కు, అఫ్ఘాన్ రెజిమెంట్‌కు చెందిన వాళ్లున్నారు.
Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?
ఇక జనరల్ డయ్యార్ వెంటనే కాల్పులకు ఆదేశించాడు. దీంతో బ్రిటిష్ సైనికులు అక్కుడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మరణకాండంలో దాదాపు 1000 మంది చనిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. మరో 2 వేల మంది గాయాలపాలయ్యారు. కాల్పులు జరిగిన తర్వాత గాయపడ్డ వాళ్లకి దాహం తీర్చుకునేందుకు చుక్క మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఆసమయంలో కనీసం మంచినీరు, వైద్యసాయం అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిన తర్వాత జనరల్ డయ్యర్ ఇంగ్లాడ్‌కు వెళ్లిపోయాడు. భారత్‌లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ డయ్యర్‌ను సస్పెండ్ చేసింది. ఇక ఉధమ్ సింగ్ లండన్‌లో 1940 మార్చి 13న డయ్యర్‌ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. స్వాంతత్ర్య వీరుల స్మృతి చిహ్నంగా జలియన్ వాలాబాగ్‌లో భారత ప్రభుత్వం ఓ స్మారక స్థూపాన్ని నిర్మించింది. మాజీ రాష్ట్రపతి డా.బాబు రాజేంద్రప్రసాద్ ఈ స్థూపాన్ని ప్రారంభించారు.
telugu-news | rtv-news | national-news | british
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam