15 రోజుల పాటు వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. కోటికి పైగా కొట్టేశారుగా!

సైబర్ స్కామర్లు మరోసారి రెచ్చిపోయారు. 90ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.కోటికి పైగా కొట్టేశారు. ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.

New Update
CV anand: రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

సైబర్ కేటుగాళ్ల వలలో మరో వృద్ధుడు చిక్కుకున్నాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆ వృద్ధుడి నుంచి దాదాపు రూ.కోటికి పైగా కొట్టేశారు. తాను సంపాదించుకున్న మొత్తాన్ని కేటుగాళ్లు కొట్టేయడంతో ఆ వృద్ధుడు లబోదిబోమంటున్నాడు. ఇక తాను మోసపోయినట్లు గుర్తించి అతడు తమ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఈ ఘటన తాజాగా గుజరాత్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భవేష్ రోజియా పూర్తి వివరాలు వెల్లడించారు.

90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్

గుజరాత్ కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు స్టాక్ మార్కెట్ లో వ్యాపారం చేసేవాడు. ఆయనకు స్కామర్ల నుంచి ఓ రోజు వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ వృద్ధుడు కాల్ లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు.

Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం

కేసు నమోదు చేస్తామని.. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఇలా దాదాపు 15 రోజుల పాటు ఆ వృద్ధుడిని భయపెట్టారు. ఇది చాలా రహస్యంగా జరుగుతున్న ఇన్విస్టిగేషన్ అని ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అనంతరం అకౌంట్లో ఉన్న డబ్బును తమ ఖాతాలకు పంపించాలని ఆ కేటుగాల్లు సూచించారు.

Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

ఈ కేసుకు మీకు ఎలాంటి సంబంధం లేదని తేలేవరకు ఆ డబ్బు తమవద్దే సేఫ్ గా ఉంటుందని నమ్మించారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో డబ్బులు పంపించేస్తామని తెలిపారు. దీంతో అది నమ్మిన వృద్ధుడు వారు ఇచ్చిన ఖాతాలకు రూ. 1,15,00,000 పంపించాడు. ఈ వ్యవహారం అంతా దాదాపు 15 రోజుల పాటు కొనసాగింది. 

Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

అయితే మూడు రోజులైనా ఎప్పటికీ కేటుగాళ్ల నుంచి ఫోన్ రాకపోవడంతో ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాని సూత్రధారి పార్థ్ గోపాని అని తెలిసింది. ప్రస్తుతం అతడు కంబోడియాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టయిన వారి నుంచి అనేక బ్యాంకులకు చెందిన 23 బ్యాంక్ చెక్ బుక్‌లు, 46 డెబిట్ కార్డులు, 9 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, నాలుగు వేర్వేరు సంస్థల రబ్బర్ స్టాంపులు, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Moon: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు భారత్ సిద్ధమవుతోంది 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 2035 నాటికి ఉంటుందన్నారు.

New Update
 Indian Astronaut to land On Moon By 2040

Indian Astronaut to land On Moon By 2040

చంద్రయాన్ 3 విజయం సాధించిన తర్వాత అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు సిద్ధమవుతోంది. అయితే 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగు పెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఓ జాతీయ మీడియా ఏర్పాటు చేసిన రైజింగ్‌ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 'భారత్‌ స్పేస్ స్టేషన్' 2035 నాటికి ఉంటుందని చెప్పారు.  

Also Read: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

ఇదిలాఉండగా చంద్రయాన్ 3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రవంపై ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశగా భారత్ నిలిచింది. అంతేకాదు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌ 4 పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈసారి చంద్రుడి ఉపరితల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. 2027లో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనుంది.  

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

ఇందులో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను రెండుసార్లు ప్రయోగిస్తారు. చంద్రయాన్‌ 4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపించి వాటిని కక్ష్యలోనే బిగిస్తారు. అయితే చంద్రుడి పైకి భారత వ్యోమగామిని పంపించేవరకు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు. 

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

chandrayan-3 | isro | space-station | indian-space-station

Advertisment
Advertisment
Advertisment