/rtv/media/media_files/2025/04/05/nrpf3ObVYCbD5gGoaQ3n.jpg)
Crow Talks Like A Human Watch Viral Video
యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు సైతం ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే చూడటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచం నలుమూలల్లో జంతువుల చిత్ర విచిత్ర వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అలాంటిదే జరిగింది.
In Palghar, a rescued crow raised by family now speaks in a man’s voice pic.twitter.com/hUHn4QWg7X
— Being Punekar (@beingpunekar1) April 3, 2025
Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
వీడియో వైరల్
మనుషులతో సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక కాకి మనిషిలా మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో అది చూసి ఇంటర్నెట్ వినియోగదారులు నమ్మలేకపోతున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్‌లోని ఒక కాకి మనుషుల మాదిరిగానే మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లైక్స్, షేరింగ్స్‌తో ట్రెండింగ్ అవుతోంది.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆ క్లిప్‌లో ఒక కాకి ‘‘పాపా, పాపా, పాపా’’ అని పదే పదే అరవడం వినవచ్చు. అయితే ఆ వీడియో పాల్ఘర్ వాడా తాలూకాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది. తనూజా ముక్నే అనే మహిళకు మూడు సంవత్సరాల క్రితం తన తోటలో కాకి గాయాలతో కనిపించింది. వెంటనే దానికి ట్రీట్మెంట్ అందించి పదిహేను రోజుల పాటు జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత తాను పెంచుకున్న కాకికి మనిషిలా మాట్లాడటం నేర్పించింది. అప్పట్లో అది చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇప్పుడు ఆ కాకి కుటుంబ సభ్యులతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
Also read: గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
(viral-news | viral-video | crow | latest-telugu-news | telugu-news)