![budget](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/01/m4V3VKy4BllcNiKs3u4z.jpg)
salary Hike After Budget 2025?
ముందే చెప్పుకున్నట్టుగా 2025 బడ్జెట్ సామాన్యులకు , వేతన జీవులకు లాభం చేకూరేదిగా ఉండనుందని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, నెమ్మదిగా పెరుగుతున్న జీతాలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను స్లాబ్‌లో మార్పులు రావొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మూడు లక్షల వరకూ ఉన్న క్యాప్ ఐదు లక్సలు పెంచొచ్చని అంచనాలు వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను తీసుకురావొచ్చని ఆర్థిక సర్వే చెప్పింది. ముఖ్యంగా పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారుల ఖర్చులు పెరిగే అవకాశముండటంతో, ఇది ఆర్థిక వ్యవస్థకు కొంత బలాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు దేశంలో కార్పొరేట్ లాభాలు పెరుగుతూనే ఉన్నప్పటికీ వేతన వృద్ధి మాత్రం వెనుకబడే ఉంది. మఖ్యంగా ఐటీలో ఆదాయ అసమానత ఆందోళన కలిించేదిగా ఉంది. ఆటో మొబైల్స్ లో అయితే కార్పొరేట్ లాభం ఏకంగా 15 ఏళ్ళ గరిష్ట స్థాయికి చేరుకుంది. లాభాలు పెరుగుతున్నప్పటికీ, వేతనాల పెరుగుదల వేగాన్ని కొనసాగించడంలో విఫలమైంది. FY24లో కార్పొరేట్ లాభాలు 22.3% పెరగగా, ఉపాధి 1.5% మాత్రమే పెరిగింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అంటున్నారు. ఈ తేడా, ఆర్థిక అసమానతలు...దేశ ఆర్థిక వేగాన్ని నెమ్మదిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పొందాలంటే మూలధనం, శ్రమ మధ్య ఆదాయాన్ని న్యాయమైన, సహేతుకమైన పంపిణీ జరగాలని ఆర్థిక సర్వే చెబుతోంది. దీని బట్టి బడ్జెట్ లో వేతనాలకు సంబంధించిన సంస్కరణలు చేస్తారని..ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!