/rtv/media/media_files/2026/04/02/tvk-2026-04-02-17-47-22.jpg)
Cop On Security Duty Injured At TVK Chief Vijay’s Rally In Tiruchirappalli
టీవీకే అధినేత విజయ్ నామినేషన్ ర్యాలీ(TVK chief Vijay rally) లో అపశృతి చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ను అభిమానులు చుట్టేశారు. ఈ క్రమంలోనే పార్టీ నేత అర్జున్ కారు ఢీకొనడంతో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. గతేడాది కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా పార్టీ భద్రతా ఏర్పాట్లపై మరోసారి విమర్శలు వస్తున్నాయి.
Also Read : రూ.167 కోట్లకు అమ్ముడుపోయిన రవివర్మ పెయింటింగ్..
Cop On Security Duty Injured At TVK Chief Vijays Rally
🚨 ANOTHER MISHAP IN VIJAY'S RALLY
— Nabila Jamal (@nabilajamal_) April 2, 2026
A cop hurt his leg at a TVK rally in Tiruchirappalli by TVK leader Aadhav Arjun's car
Vijay’s public meeting saw chaotic crowd management again pic.twitter.com/q1qkt1azAY
ఇప్పటికే కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ కూడా పలుమార్లు సీబీఐ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఈ విషాద ఘటన దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే విజయ్.. గురువారం నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు కూడా మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్!
విజయ్ నిర్వహించే సభలకు వచ్చే జనాలను నియంత్రించడంలో పార్టీ వాలంటీర్లు, భద్రతా విభాగం ఫెయిల్ అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ సభకు భారీగా వచ్చే అభిమానులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కఠినంగా భద్రతా రూల్స్‌ను పాటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Follow Us