/rtv/media/media_files/2025/03/07/TtIvlcUhe7RVixxi3H9C.jpg)
Shama Mohamed
రోహిత్ శర్మ బాడీపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ మేథమెటిక్స్ (Maths) ఇస్లాం మతం ద్వారా వచ్చిందని తెలిపారు. అలాగే ఇస్లాం ఎలా పురోగతిలో ఉందో వివరించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో షామా మొహమ్మద్‌పై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసింది.
"Maths has come through Islam.."
— THE SKIN DOCTOR (@theskindoctor13) March 6, 2025
Now this is new! Even the most staunch Islamic scholars haven't claimed this, yet here a doctor is saying it—despite the widely known fact that mathematics existed thousands of years before Islam. pic.twitter.com/vAvFrJha4O
ఇదిలాఉండగా.. ఇటీవల షామా మొహమ్మద్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ.. రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేని చెప్పుకోచ్చారు.
Also Read: తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
అయితే ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో షామా మొహమ్మద్ రోహిత్ శర్మను పొగిడారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలవడం చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. అయితే తాజాగా ఆమె మేథమెటిక్స్ అనేది ఇస్లాం ద్వారా వచ్చిందని చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
Also Read: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్!