India AI Summit: ఇండియా AI సమిట్‌లో ఉద్రిక్తత.. చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ నిరసన

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నిరసనలతో అట్టుడికింది. సమిట్ జరుగుతుండగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలువురు కార్యకర్తలు తమ చొక్కాలను విప్పి నినాదాలు చేశారు.

New Update
Youth Congress

దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026(India AI Summit) నిరసనలతో అట్టుడికింది. సమిట్ జరుగుతుండగా శుక్రవారం యూత్ కాంగ్రెస్(youth-congress) కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ(PM Modi) తీరును నిరసిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలువురు కార్యకర్తలు తమ చొక్కాలను విప్పి నినాదాలు(Congress protests) చేశారు. ఇండియా అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

సదస్సు నిర్వహణలో లోపాలు, నిరుద్యోగం, ఏఐ వల్ల కలిగే ఉద్యోగ నష్టాలపై నిరసన తెలుపుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా తమ షర్టులు విప్పి నినాదాలు చేశారు. సెక్యురిటీ సిబ్బందిని ఛేదించుకుని సభావేదిక వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతలు ఈ నిరసనను సమర్థిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ పౌరుల డేటాను విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ అంతర్జాతీయ సదస్సును ప్రభుత్వం ఒక 'పిఆర్ స్టంట్'లా మార్చేసిందని, ఇందులో భారత్ ప్రతిభ కంటే చైనా ఉత్పత్తుల ప్రదర్శనకే ప్రాధాన్యతనిచ్చారని విమర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, దానిపై స్పష్టత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు నిరసనకారులను అడ్డుకుని, కనీసం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read :  ఎవరీ లేడీ డాన్ మేడం జెహర్.. పగలంతా బ్యూటీ పార్లర్, రాత్రైతే అదే పని!

Congress Protests At India AI Summit 2026

కాంగ్రెస్ తీరుపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. దీన్ని జాతీయ అవమానంగా అభివర్ణించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ, "రాహుల్ గాంధీ ఆదేశాలతోనే కాంగ్రెస్ కార్యకర్తలు అర్బన్ నక్సల్స్ లా ప్రవర్తిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులు వచ్చిన సదస్సులో ఇలా చొక్కాలు విప్పి ప్రదర్శన చేయడం దేశ గౌరవాన్ని దిగజార్చడమే" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజకీయ దుమారం
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. AI అంటే 'అశ్విని ఈజ్ ఇన్ కాంపిటెంట్' అని ఎద్దేవా చేశారు. గల్గోటియాస్ యూనివర్శిటీ రోబో డాగ్ వివాదం వంటివి ఈ సదస్సును ఒక స్కూల్ లెవల్ సైన్స్ ఎగ్జిబిషన్‌లా మార్చేశాయని కాంగ్రెస్ విమర్శించింది. మొత్తానికి, సాంకేతిక రంగంలో భారత్ సత్తాను చాటాల్సిన ఏఐ సమిట్ కాస్తా, రాజకీయ రణక్షేత్రంగా మారిపోయింది.

Also Read :  షాకింగ్ ఘటన.. పెళ్లికి ఒకరోజు ముందు క్రిమినల్‌తో పారిపోయిన లేడీ కానిస్టేబుల్

Advertisment
తాజా కథనాలు