రోహిత్ శర్మ పరమ చెత్త కెప్టెన్... కాంగ్రెస్ మహిళ నేత సంచలన కామెంట్స్ !

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్  మహిళా నేత షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి.

New Update
rohit sharma, congress

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్  మహిళా నేత డాక్టర్ షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని ఆమె అన్నారు. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని షామా మొహమ్మద్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేని ఆమె చెప్పుకోచ్చారు. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన  మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ఈ కామెంట్స్  చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ షామా తన పోస్టులో శర్మపై విమర్శలు గుప్పిస్తూ, రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని  బరువు తగ్గాలని ఇండియన్ క్రికెట్ లో ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అని ఆమె కామెంట్ చేశారు.  

ప్రదీప్ భండారి ఫైర్ 

దీంతో ఆమె చేసిన కామెంట్స్ పై  బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.  రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుందంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు.  బీజేపీ నేత షెహజాద్ పూనవాలా స్పందిస్తూ, "రాహుల్ గాంధీ కెప్టెన్సీలో ఢిల్లీ ఎన్నికల్లో 3సార్లు డకౌట్ అయినవారు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు " అని అన్నారు. దీంతో తాను చేసిన కామెంట్స్ కు తీవ్ర విమర్శలు రావడంతో షామా మొహమ్మద్ వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నించారు.  ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు.  రోహిత్  ఫిట్‌నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేశానని..  ఇది బాడీ షేమింగ్ కాదన్నారు.  ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు.  రోహిత్  కొంచెం బరువుగా ఉన్నాడని భావించాను, కాబట్టి నేను దాని గురించి ట్వీట్ చేసానని తెలిపారు. అలా  చెప్పడంలో తప్పు ఏమిటి అని ఆమె ప్రశ్నించారు.  

Also read : Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు