హేమంత్‌ సోరెన్‌కే జై కొట్టిన ఝార్ఖండ్ ప్రజలు.. ఫలించిన ఆ రెండు అంశాలు

ఝార్ఖండ్‌లో ఎన్డీయే అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ సీఎం కాబోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
New Update
ffd
ఝార్ఖండ్‌ ప్రజలు ఎన్డీయే కూటమికి షాకిచ్చారు. కాంగ్రెస్, జేఎంఎం కూటమికే అధికారం అప్పజెప్పారు. అక్కడ ఇండియా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎన్డీయే కూటమి 25 స్థానాలకే పరిమితమైపోయింది. మొత్తానికి సీఎం హేమంత్ సోరెన్ పట్ల సానుభూతి కలిసొచ్చింది. ఎన్నికలకు ముందు హేమంత్‌ను అవినీతి ఆరోపణలతో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  
జేఎంఎంను చీల్చేందుకు చంపై సోరెన్‌ను బీజేపీ అస్త్రంగా వినియోగించింది. ఇందుకోసం ఆయన్ని తమ పార్టీలో కూడా చేర్చుకుంది. ఎన్నికల్లో కూడా అనేక వ్యూహాలు రచించి విస్తృత ప్రచారం చేసింది. కానీ అవేమి కూడా ఫలించలేకపోయాయి. బీజేపీ తీరు పట్ల ఝార్ఖండ్‌ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ పార్టీ అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.  

అయితే ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి గెలుపునకు రెండు అంశాలు కలిసొచ్చాయని చెప్పొచ్చు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయానికి ఇవి బుస్టర్లుగా పనిచేశాయి. ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ.2వేల 500 సాయం చేయడం, మరొకటి హేమంత్‌ సోరెన్‌ను జైలుకు పంపడం ద్వారా ప్రజల్లో సెంటిమెంట్‌ను రాజేసేలా చేయడం. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఈ రెండు అంశాలు బాగా పనిచేశాయనే ప్రచారం నడుస్తోంది.
ఇదిలా ఉండగా భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న సీఎం హేమంత్‌ సోరెన్‌ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ని బిర్సా ముండా జైలుకు తరలించారు. దీంతో ఆయన అరెస్టుకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో చంపై సోరెన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. చివరికి ఐదు నెలల తర్వాత హేమంత్ సోరెన్‌ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జులైలో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమిలు పోటాపోటీగా బరిలోకి దిగాయి. చివరికి ఝార్ఖండ్ ప్రజలు జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి వైపే మొగ్గుచూపారు.  
Advertisment
Advertisment
తాజా కథనాలు