PM Modi: రాష్ట్రపతిని అవమానించారు.. ధ్వజమెత్తిన ప్రధాని మోదీ

రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో అంతరాయం కలిగించి పేద, గిరిజన రాష్ట్రపతినే కాక రాజ్యంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని తీవ్రంగా విమర్శలు చేశారు.

New Update
Congress Insulted President, Says PM Modi

Congress Insulted President, Says PM Modi

రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో అంతరాయం కలిగించి పేద, గిరిజన రాష్ట్రపతినే కాక రాజ్యంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని తీవ్రంగా విమర్శలు చేశారు. కేంద్రమంత్రి బిట్టూని ద్రోహి అని సిక్కులను రాహుల్ గాంధీ అవానించారంటూ మండిపడ్డారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సుధీర్ఘంగా ప్రసంగం చేశారు. విపక్ష నేతకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలంటూ విపక్ష పార్టీలు సభలో నినాదాలు చేశాయి. ఆ తర్వాత వాకౌట్‌ చేశాయి. 

Also Read: ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు.. చరిత్రలో మొదటిసారిగా

రాజ్యసభలో దాదాపు 100 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక అంశాల గురించి మాట్లాడారు. 11 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వెల్లడించారు. అధిక వృద్ధి, అత్యల్పమైన ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని నిరూపించాయని అన్నారు. భారత్‌ వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని.. దక్షిణార్థ గోళ దేశాలకు గొంతుకగా మన దేశం మారిందన్నారు.  

Also Read: మేఘాలయ బొగ్గుగనిలో ఘోర ప్రమాదం..10 మంది కూలీలు మృతి

ఇటీవల పలు దేశాలతో 9 వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నామని తెలిపారు. ఐరోపా కూటమి అలాగే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల వల్ల మరింత భారత్ సుస్థిరంగా మారినట్లు ప్రపంచ భావిస్తోంది. అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని అన్నారు.  

Advertisment
తాజా కథనాలు