ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు ముదురుతున్నాయి. శనివారం ఆప్ పార్టీ నిజాయితీ లేని వ్యక్తులు వీల్లే అంటూ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. వారిలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ పేరు పేర్కొని పోస్టర్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై మండిపడింది. మరోవైపు బీజేపీకి బీ టీం ఆప్ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు.
Read also :జాతినుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము.. జమిలి ఎన్నికలపై ఏమన్నారంటే ?
దమ్ముంటే ఇండియా కూటమి నుంచి వైదొలగాలని అరవింద్ కెజ్రీవాల్‌కు సవాల్ విసిరింది. 2024 లోక్‌సభ ఎన్నికల టైంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేశామని కల్కాజీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ధైర్యం ఉంటే, కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలని సవాల్ విసిరారు. వంద మంది ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అల్కా లంబా చెప్పారు.
Read also : పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌లను అరవింద్ కేజ్రీవాల్ అవమానించారని ఆమె ఆరోపించారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకునేందుకు అరవింద్ కేజ్రీవాలే’ అని అన్నారు.