/rtv/media/media_files/2025/02/17/UtpR8ewinmX84obwMF9q.jpg)
Maha Vikas Aghadi and Mahayuti
మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల్లో రాజకీయాలు గందరగోళంగా మారాయి. పార్టీల నేతల వ్యవహార శైలితో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేను ఎన్సీపీ (SP) అధినేత శరద్ పవార్ ప్రశంసించడం దుమారం రేపుతోంది. మరోవైపు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన (ఉద్ధవ్) వర్గం సమావేశమయ్యిది. దీంతో మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల్లో రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మహాయుతి కూటమిలో అలాగే ఓడిపోయిన విపక్ష కూటమి మహా వికాస్ అఘాడిలో నేతల మధ్య విభేదాలు వచ్చాయి. చివరికీ అవన్ని సర్ధుకున్నాయి. కానీ మళ్లీ ఇప్పుడు ఈ కూటముల్లో రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. గత రెండున్నర నెలల సమయంలోనే సీఎం ఫడ్నవీస్‌తో శివసేన (ఉద్ధవ్) నేతలు మూడుసార్లు భేటీ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీలో ఉన్న కీలక నేత ఆదిత్య ఠాక్రే ఏకంగా రెండుసార్లు సమావేశమయ్యారు.
Also Read: 'చైనాను శుత్రువులా చూడటం ఆపండి'.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు
శివసేనలో చీలక రావడానికి దేవంద్ర ఫడ్నవీసే కారణమని గతంలో ఉద్ధవ్ వర్గం నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వారే బీజేపీతో భేటీ కావడం చర్చనీయమవుతోంది. అయితే త్వరలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల భేటీలు కీలకంగా మారాయి. తమకు వేరే మార్గాలు ఉన్నాయని మిత్రపక్షాలకు హెచ్చరికలు పంపేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారనే అనుమానాలు వస్తున్నయి.
మరోవైపు ఇంఛార్జ్ మంత్రుల (గార్డియన్ మినిస్టర్లు) నియామకంతో మహాయుతిలో విభేదాలు పెరిగాయి. బీజేపీకి చెందిన గిరీశ్ మహాజన్‌ను నాసిక్‌కు, ఎన్సీపీకి చెందిన అదితీ తత్కారేను రాయ్‌గఢకు ఇంఛార్జీలుగా నియమించడం వల్ల శివసేన షిండే వర్గం ఆగ్రహంగా ఉంది. తమ మంత్రులైన దాదాజీ భూసే, భరత్ గొడావలేలను ఈ లిస్టులో చేర్చకపోవడంపై ఆ పార్టీ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహాజన్, తత్కారేల నియామకం ఆగిపోయింది.
Also Read: నేటి ఢిల్లీ భూకంపం.. రాబోయే ప్రళయానికి సంకేతమా..?
ఇక మహా వికాస్ అఘాడి కుటమిలో కూడా పార్టీల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఎన్సీపీ నేత శరద్ పవార్ పొగిడారు. దీంతో శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ శరత్ పవార్‌ను తప్పుబట్టారు. ఇలా జరిగిన రెండ్రోజులకే ఆదిత్య ఠాక్రే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. కానీ అక్కడే ఉన్న శరద్ పవార్‌ను మాత్రం కలవలేదు. అయితే చాలామంది శివసేన (ఉద్దవ్) నేతలు స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని ఉద్ధవ్ ఠాక్రేకు సూచనలు చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటమిల్లో రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో అనేది ఆసక్తిగా మారింది.