టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్ భయాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇందులో 12 వేల మంది ఉద్యోగులు భారతీయులే ఉన్నారు. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఏటా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఏ క్షణాన ఎప్పుడు ఉద్యోగం పోతుందనే భయాందోళనలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ (NITES) తీవ్రంగా స్పందించింది. కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ కూడా షేర్ హోల్డర్ల ప్రయోజనాల కోసం AIని సాకుగా చూపిస్తూ ఉద్యోగాలు తీసేస్తున్నాయని ఆరోపణలు చేసింది.
Also Read: ‘థార్ ఎడారి’ ప్లాన్‌తో ఇంధన సంక్షోభానికి ఇండియా చెక్.. రికార్డు స్థాయి ఉత్పత్తి!
ఉద్యోగులను తొలగించే అంశం చివరి ఆప్షన్‌గా ఉండాలని.. దీనికి బదులుగా వాళ్లకి కొత్త టెక్నాలజీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని NITES ప్రెసిడెంట్ హర్పీత్ సింగ్ సలూజా డిమాండ్ చేశారు. ఏఐ ప్రాజెక్టులపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పుడు.. తమ ఉద్యోగుల భవిష్యత్తు విషయంలో కూడా బాధ్యత వహించాలని సూచించారు. ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి లేఆఫ్‌లు చేయడం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు.
వైట్ కాలర్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చే విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నైట్స్ కోరింది. ప్రైవేటు రంగంలోని ఐటీ ఉద్యోగులకు రక్షణ లేదని తెలిపింది. అందుకే బలవంతపు రాజీనామాలు, సామూహిక లేఆఫ్‌ల విషయంలో స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేసింది. నోటీసు పీరియడ్, మెరుగైన పరిహారం, యాజమాన్యాల జవాబుదారీతనంపై కఠినమైన రూల్స్ ఉండాలని పేర్కొంది.
Also Read: హర్మూజ్ దాటిన గ్రీన్ ఆష.. భారత్‌కు చేరిన 9వ LPG నౌక
ఇదిలాఉండగా గత కొన్ని నెలల్లో చూసుకుంటే గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది ఇప్పటికే 70కి పైగా కంపెనీలు 40,480 మంది లేఆఫ్ చేశాయి. కరోనా సమయంలో ఎక్కువ మందిని ఉద్యోగాల్లో నియమించడం, ఏఐ వల్ల లేఆఫ్‌లకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
Layoffs: టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్‌ల ఆందోళనలు.. NITES సంచలన ప్రకటన
ఐటీ ఉద్యోగులు ఏ క్షణాన ఎప్పుడు ఉద్యోగం పోతుందనే భయాందోళనలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ (NITES) తీవ్రంగా స్పందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Companies must take responsibility, NITES Comments amid layoffs