/rtv/media/media_files/2025/03/29/qnTsNcvrSnuvKs0uHEVi.jpg)
Betting Apps
Betting Apps : తెలంగాణ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలనంగా మారాయి. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ కమెడియన్ అలీ కూడా ఇందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ తన యూట్యూబ్ ఛానల్ లో ఆలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని.. అలీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందంటూ బాంబు పేల్చాడు ప్రపంచ యాత్రికుడు.ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న అన్వేష్ ఓ మజీద్ ముందు చేతిలో ఖురాన్ పట్టుకుని మాట్లాడుతూ ఓ వీడియో రూపొందించాడు. ఖురాన్ సాక్షిగా ఒక్క బూతు కూడా మాట్లాడుతున్నానంటూ వీడియో మొదలు పెట్టాడు. రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్న అలీ, అది కూడా రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేశారంటూ ప్రశ్నించారు? సహాయం పేరుతో చాలా మోసం చేశారంటూ విమర్శించారు.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
'బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టి వెయ్యి సినిమాల్లో నటించారు. 50 సినిమాల్లో హీరోగా నటించారు. సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 1000 కోట్లు ఉంటుంది. అలాంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేశాడు' అంటూ ప్రశ్నించాడు. అలీ జనాలను ఎలా మోసం చేశాడో అన్వేష్ చెప్పుకొచ్చాడు.
'అలీ గారి భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్‌కు సుమారు 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరు కనివినీ ఎరగని విధంగా తెలుగులో బిర్యానీ మోసం చేశారు. రూ. 10 వేలతో చికెన్ బిర్యానీ తయారు చేసి కొంతమంది అనాధలకు ఇచ్చారు. అయితే ఈ వీడియోను 50 లక్షల మంది చూశారు. ఈ వీడియో ద్వారా వీరికి యూట్యూబ్ సుమారు రూ. 5 లక్షలు ఇచ్చింది. ఇందులో ఏం తప్పులేదు. కానీ ఈ వీడియోలో బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. వేల కోట్లు ఆస్తులు ఉండి, సహాయం పేరుతో ఇలా మోసం చేస్తే అల్లా క్షమిస్తారా.?' అంటూ ప్రశ్నించారు. బిర్యానీ ప్యాకెట్ల పేరుతో సహాయం చేస్తున్నట్లు నటించి.. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోవడం మోసం కాదా అంటూ అన్వేష్ విరుచుకుపడ్డాడు. భారతదేశాన్ని దెబ్బ తీయాలని పలు దేశాలు చేస్తున్న కుట్రలో భాగం కావడం ఎంత వరకు సబబు? అంటూ అన్వేష్ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : బడికి వెళ్లమన్నందుకు..ఆరుగురు విద్యార్థులు అదృశ్యం!
ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి అంటూ ఆలీని విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రపంచ యాత్రికుడు పెట్టిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్... కమెడియన్ ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తున్న ముసుగులో... జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? అంటూ కమెడియన్ ఆలీపై నిప్పులు.. జరుగుతున్నారు. మరి దీనిపై కమెడియన్ ఆలీ ఎలా స్పందిస్తారో చూడాలి. అటు ప్రపంచయాత్రికుడు ఎవరిని టార్గెట్ చేసిన... వాళ్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆలీ విషయంలో తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : టాప్ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య!