ఢిల్లీ లిక్కర్ స్కాం పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని.. ఇప్పుడు అసలు పార్టనర్ ఆప్ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రకటించింది. హమీల పోస్టర్లను రేవంత్ విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని.. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలను ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో రూ.21 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్.. ఇది తమ పార్టీ నిబద్ధతను తెలియజేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పిన సీఎం.. . ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని.. మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది.. అమలు చేసిందా? అని సీఎం నిలదీశారు.
మోడీ, కేజ్రీవాల్ ఒక్కటే
ప్రధాని మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటేనని .. పేర్లు మాత్రమే వేరు, ఇద్దరు అబద్ధాలు ఆడుతారని విమర్శించారు. కాలుష్యంతో తెలంగాణ ప్రజలు ఢిల్లీకి రావాలంటే భయపడుతున్నారని - సీఎం తెలిపారు. షీలా దీక్షిత్ నేతృత్వంలోనే ఢిల్లీ అభివృద్ది జరిగిందన్నారు సీఎం రేవంత్. ఆప్, బీజేపీ ఢిల్లీకి ఏం చేశాయని సీఎం ప్రశ్నించారు. మోదీ, కేజ్రీవాల్ ఢిల్లీని ఆగం పట్టించారని మండిపడ్డారు. ఢిల్లీ మెట్రో, సీఎన్ జీ వాహనాలు కాంగ్రెస్ తెచ్చిందని.. కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టకుండా.. సెలవులివ్వడం పైనే మోదీ, కేజ్రీవాల్ పోటీ పడుతున్నారని విమర్శించారు. మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5న ఎన్నికలు
ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.
Also Read : సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
లిక్కర్ స్కామ్ పార్టీని ఓడిస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని.. అసలు పార్టనర్ ఆప్ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రకటించింది. హమీల పోస్టర్లను ఆయన విడుదల చేశారు.