మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలను సమయం ఇవ్వాలని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎమ్మె్ల్యేలు, మంత్రులు సీఎం నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్ వారితో మాట్లాడుతూ.. '' సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలి. మీ ప్రొగ్రెస్ రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నేను మారాను. మీరు కూడా మారండి. Also Read: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. అది చేస్తే సహించేది లేదు. విపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వండి. కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం జరగాలని'' సీఎం రేవంత్ అన్నారు. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం జనవరి 21 నుంచి 23వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. Also Read: ఈ ఏడాది సంస్కరణల సంవత్సరం.. రక్షణశాఖ కీలక ప్రకటన ఇదిలాఉండగా.. దావోస్లో 20 నుంచి 24వ తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు 'ప్రపంచ ఆర్థిక వేదిక' వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Also Read: నా తల్లి, 4గురు చెల్లెళ్లను అందుకే చంపేశా: వీడియో రిలీజ్ చేసిన కొడుకు! Also Read: ముంబయి కోర్టు సంచలన తీర్పు.. 8 మంది పాకిస్థానీయులకు 20 ఏళ్ల జైలుశిక్ష..