/rtv/media/media_files/2025/02/24/P7PzzflddeR6ocDaVL6U.jpg)
CM Rekha Gupta and Arvind Kejriwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎంగా రేఖా గుప్తాకు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ఫిబ్రవరి 20న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే రేఖాగుప్తా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని ఇప్పటికే ఆమె వెల్లడించారు. అయితే మరీ సీఎం రేఖా గుప్తాకు జీతం ఎంత వస్తుంది ?, ఓడిపోయిన మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పింఛన్ ఎంత వస్తుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: ఆ 8 మంది బతకడం కష్టమే.. లోపల పరిస్థితి ఇది.. RTVతో సంచలన విషయాలు చెప్పిన అధికారులు!
అయితే సీఎం రేఖా గుప్తాకు ప్రతి నెల రూ.1.70 లక్షల జీతం వస్తుంది. ఈ జీతాన్ని 2023, మార్చి నాటి ఆదేశం ప్రకారం నిర్ణయించారు. ఇందులో ఆమె ప్రాథామిక జీతం(బేసిక్ శాలరీ) రూ.60,000 ఉంటుంది. దీంతో పాటు ఆమెకు పలు అలోవెన్స్‌లు ఉంటాయి. వీటిలో రూ.30,000 అసెంబ్లీ భత్యం, రూ.25,000 సెక్రటేరియట్ సాయం, రూ.10,000 టెలిఫోన్ భత్యం, రూ.10,000 ప్రయాణ భత్యం, రూ.1,500 దినసరి భత్యం రానున్నాయి. సీఎంకు జీతంతో పాటుగా కారు, బంగ్లా వంటి సౌకర్యాలు లభిస్తాయి. అలాగే ఆమె తన ప్రైవేటు కారును వినియోగిస్తే ప్రతినెల రూ.10 వేలు వస్తుంది. సీఎం నివాసానికి ప్రతి నెల 5000 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉంటుంది. అంతేకాదు ఆమె సీఎంగా పదవీకాలంలో ఉండగా రూ.12 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
ఇక ఆఫ్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయనకు మాజీ ఎమ్మెల్యేలలాగే రూ.15,000 పెన్షన్ వస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ మొత్తంపై వెయ్యి రూపాయలు పెరుగుతుంది. కేజ్రీవాల్ మాజీ సీఎం కావడం వల్ల ప్రభుత్వ వసతి గృహం, ప్రభుత్వ కారు, డ్రైవర్ సేవలు ఉంటాయి. ఇందుకు తోడు టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రయాణ భత్యం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా అందుతాయి.