/rtv/media/media_files/2026/03/28/cm-mamata-banerjee-2026-03-28-16-48-25.jpg)
CM Mamata Banerjee Says, By attempting to destroy Bengal, BJP will lose power in country
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శ్రీ రామనవమి శోభయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచాక ఢిల్లీని స్వాధీనం చేసుకునేందుకు అన్ని పార్టీలతో కలిసి ముందుకెళ్తామన్నారు.
Also Read: పెళ్లయిన వ్యక్తితో యువతి సహజీవనం.. కోర్టు సంచలన తీర్పు!
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లు ప్రయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నేతలు ఆఖరికీ దర్యాప్తు సంస్థలను కూడా వాడుకుంటున్నారంటూ విమర్శించారు. ఆ పార్టీ ఆదేశించడం వల్లే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ముందు సర్ ప్రక్రియను హడావిడిగా చేప్టటిందని మండిపడ్డారు. ఓటర్ల లిస్టు నుంచి బెంగాలీ ఓటర్లను తొలగించేందుకే బీజేపీ ఈసీని పావులా వాడుకుంటోందని విమర్శించారు. తమ రాష్ట్రంలో బీజేపీని అడుగు పెట్టనీయకుండా దేశాన్ని రక్షించడమే తమ టార్గెట్ అన్నారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ భర్త పోటీ.. ఎక్కడి నుంచి అంటే?
మరోవైపు రాణిగంజ్‌లో ఉన్న పర్వత ప్రాంతాల్లో కొండచరియలు తరచుగా విరిగిపడుతున్నాయని తెలిపారు. ఈ ఘటనల వల్ల అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు వాపోయారు. ప్రజలను ఇలాంటి ప్రదేశాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమ ప్రభుత్వం ఇంటి వసతితో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో గెలిచాకా దేశంలో ఇతర రాజకీయ పార్టీలతో కలిసి బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న కౌంటింగ్ ఉంటుంది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వస్తుందా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Follow Us