MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ

నాగ్ పూర్ లోని ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ మహారాష్ట్రలోని వీహెచ్ పీ నిర్వహించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిమ్ ల పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాపించడంతో రెండు గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డాయి. 

New Update
MH

Clash Erupts In Nagpur Amid Aurangzeb Tomb

మహారాష్ట్రోలని ఔరంగజేబు సమాధి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొదట ఇక్కడ ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ వీహెచ్ పీ నిరసనలు నిర్వహించింది. దీని తరువాత కొన్ని గంటల్లోనే ఇక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  ముస్లిమ్ ల పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాపించడంతో రెండు గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డాయి.  మహల్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్ళ దాడికి పాల్పడ్డాయి. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది అల్లరి మూకలను అదుపు చేశారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ప్రజలను శాంతంగా ఉండాలని కోరారు. నాగపూర్ ప్రశాంతమైన నగరమని...ఇక్కడి ప్రజలు సంతోషాలను, దు:ఖాలను పంచుకుంటారని చెప్పారు. ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. 

ఔరంగజేబు సమాధి దగ్గర..

ప్రస్తుతం ఔరంగజేబు సమాధి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. అంతకు ముందు ఇక్కడ రెండు వర్గాల రాళ్ళ దాడిని చేసుకున్నాయి. అంతే కాదు వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు. అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడమే కాక టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. ఈ మొత్తం ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పార్లమెంటులో నాగ్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రజలు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

అంతకు ముందు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్ధన్‌ సప్కల్‌ తీవ్రంగా విమర్శలు చేశారు. ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడని అన్నారు. '' ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడు. అతడు తన సొంత తండ్రినే జైల్లో పెట్టాడు. ఇప్పుడున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా అలాంటి క్రూర స్వభావం ఉన్నవారే. మతాన్ని ఆధారంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు యత్నిస్తాడు. కాబట్టి వీళ్లిద్దరి పరిపాలన ఒకే విధంగా ఉంటుందని'' హర్షవర్ధన్ అన్నారు. మరోవైపు ఫడ్నవీస్‌ను ఔరంగజేబుతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ కాంగ్రెస్ మరింత దిగజారిందంటూ విమర్శించింది.     ఔరంగజేబుతో ఫడ్నవీస్‌ను పోల్చడం.. కాంగ్రెస్‌ బాధ్యతారాహిత్యాన్ని, పిల్ల చేష్టలను సూచిస్తున్నాయని ధ్వజమెత్తింది. ఇలా చేస్తే ప్రజల్లో పార్టీకి ఉన్న కాస్త మద్దతు కూడా పూర్తిగా పోతుందని తెలిపింది. 

Also Read:Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు