15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఈ కేసులో సుప్రీంకోర్టు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఆ బాలికకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court

Supreme Court

15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఈ కేసులో సుప్రీంకోర్టు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఆ బాలికకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎయిమ్స్‌ క్యురేటివ్ పిటిషన్ వేసింది. ఈ దశలో గర్భం తొలగిస్తే ఆ బాలిక ఆరోగ్యంపై ఎఫెక్ట్‌ చూపిస్తుందని తెలిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కేంద్రానికి సూచనలు చేసింది. అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరణ చేయాలని సూచనలు చేసింది. 

Also Read: తమిళనాడు ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే?...ఆ పార్టీదే విజయం?

ఇష్టం లేకుండా గర్భాన్ని అలాగే ఉంచుకోవాలని ఒక మహిళ మరో బాలికను బలవంతం చేయకూడదని ఈ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు ఆ బాలిక గర్భాన్ని తొలగించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ సుప్రీం కోర్టులో పటిషన్ వేసింది. ఈ దశలో గర్భ విచ్ఛిత్తి సాధ్యం కాదని.. ఆ మైనర్ తల్లి ఆరోగ్యంపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుందని పేర్కొంది. డెలివరీ చేసేందుకు ఇంకా నాలుగు వారాలే ఉండటంతో బిడ్డకు జన్మనిచ్చి దత్తత ఇచ్చే అంశాన్ని పరిశీలించొచ్చని సూచించింది.

Also Read: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ TMC, తమిళనాడులో DMK, .. పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్

దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం ఇది బాలికపై అత్యాచారం జరిగిన కేసు అని పేర్కొంది. ఈ ఘటన ఆమెను జీవితాంతం వెంటాడుతుందని దీనివల్ల ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకోండని వ్యాఖ్యానించింది. ఆ బాలిక ఆరోగ్యంపై ఇది శాశ్వత ప్రభావం లేకుండా అబార్షన్ నిర్వహించాలని సూచించింది. ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయంలో బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని.. వాళ్లు సరైన నిర్ణయంతీసుకోవడంలో సాయం చేయాలని తెలిపింది. ఈ విషయంలో నిర్ణయంపై బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నామని చెప్పింది. అత్యాచార కేసుల్లో బాధితులు ఎవరైన గర్భం దాల్చితే ఆ సమయంలోనైనా దాన్ని తొలగించేలా మార్పులు తీసుకురావాలని కేంద్రానికి సూచనలు చేసింది.  20 వారాలు దాటిన తర్వాత అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అత్యాచార బాధితులకు పర్మిషన్ ఇచ్చేలా చట్టాన్ని సవరణ చేయాలని సూచించింది.  

Advertisment
తాజా కథనాలు