/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court
భారత్‌లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినటువంటి నేతలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL)పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది.
Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
అలాంటి వాళ్లకు జీవిత కాలం నిషేధం విధించాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత వేటుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తే సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులు రాజకీయాల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని అశ్వినీ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు.
Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
ఈ క్రమంలోనే ఈ వ్యాజ్యంపై కేంద్రం స్పందిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇందులో కేంద్రం పలు కీలక విషయాలను ప్రస్తావించింది. చట్ట సభలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేవని కోర్టులు భావిస్తేనే రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని చెప్పింది. అంతేకాని చట్టాలు ఎలా చేయాలో, ఎలాంటి మార్పులు చేయాలో పార్లమెంటుకు చెప్పే అధికారం కోర్టులకు లేదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.
Also Read: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్
Also Read: ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!