PDS Kerosene: గ్యాస్‌, పెట్రోల్‌ కొరతను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. కిరోసిన్ పంపిణీ ప్రారంభం

హర్మూజ్ జలసంధి మూసివేతతో గ్యాస్, ఇంధనాల కొరత పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

New Update
Centre allocates PDS kerosene to States, Union territories

Centre allocates PDS kerosene to States, Union territories

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వంట గదులపై కూడా ప్రభావం చూపిస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేతతో గ్యాస్, ఇంధనాల కొరత(Gas shortage) పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.    

Also Read: షాకింగ్ ఘటన.. విమానం గాల్లో ఉండగా ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

కిరోసిన్‌ను 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంపణీ చేయాలని ఆదేశించింది. వంట, దీపాలు వెలుగించుకోవడం కోసమే కండిషన్లకు లోబడి ఈ పంపిణీని చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే లైసెన్స్‌ పొందిన సర్వీస్‌ స్టేషన్‌లో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకోవడం కోసం వెసులబాటు కల్పించనుంది. 60 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.  

Also Read: షాకింగ్ ఘటన.. విమానం గాల్లో ఉండగా ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

సుపీరియన్ కిరోసిన్ అంటే ?

సుపీరియర్ కిరోసిన్(PDS Kerosene) అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. దీన్ని అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్‌గా భావిస్తారు. ప్రధానంగా దీన్ని వంటకు, దీపాలు వెలిగించడం కోసం వాడుతుంటారు. సాధారణ లోగ్రేడ్‌ కిరోసిన్‌తో పోల్చిచూస్తే.. ఇందులో నుంచి వచ్చే వాయువులు తక్కువగా ఉంటాయి. పొగ కూడా తక్కువగానే వస్తుంది.  

Advertisment
తాజా కథనాలు