Naxalism: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే! వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఈమధ్య దండకారణ్యంలో మావోయిస్టులు (నక్సలైట్లు) పిట్టల్లా రాలిపోతున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత పదేళ్లుగా నక్సల్స్‌ను లేకుండా చేయాలని కేంద్రం ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ముఖ్యంగా మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. మావోయిజం వైపు ప్రజల దృష్టి మళ్లకుండా, దానికి ఆకర్షితులు కాకుండా ఉండేందుకు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. అంతేకాదు జనజీవన స్రవంతిలో కలిసిన వారికి భారీగా నజరానాలు కూడా ప్రకటించింది. మావోయిస్టుల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సైతం అండగా ఉంటోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 20న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 55 మంది మావోయిస్టు బాధితులతో సమావేశం అయ్యారు. दिल्ली विज्ञान भवन में केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी की अध्यक्षता में वामपंथी उग्रवाद (LWE) प्रभावित राज्यों की बैठक में मुख्यमंत्री श्री @revanth_anumula जी वरिष्ठ अधिकारियों के साथ शामिल। @TelanganaCS शांति कुमारी जी, @TelanganaDGP जितेंद्र जी, मुख्यमंत्री के प्रधान… pic.twitter.com/ONY7RVx5tb — Telangana CMO (@TelanganaCMO) October 7, 2024 2026 మార్చి 31 చివరి రోజు నక్సలిజం వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్థి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి భారీ గా నజరానాలు ప్రకటించింది. మావోయిస్టుల వల్ల నష్టపోయిన కుటుంబాలను అక్కున చేర్చుకుంది. అందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 55 మంది మావోయిస్టు బాధితులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే బాధితులు అమిత్ షాతో తమ బాధలను వివరించారు. దీంతో అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 మార్చి 31 మావోయిస్టులకు చివరి రోజు అని అన్నారు. ఆ సమయానికి వామపక్ష తీవ్రవాద రహిత భారత్‌ను చూస్తారని పేర్కొన్నారు. బస్తర్ మళ్లీ శాంతియుతంగా మారుతుందని తెలిపారు. Also Read: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! అయితే అమిత్ షా ఇలా ప్రకటన చేసి నెలరోజులు కాకముందే ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కొన్నిరోజుల క్రితమే నారాయణ్‌పూర్ - దంతేవాడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 31 మంది మావోయిస్టు మృత్యువాతపడ్డారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతలపై ప్రత్యేక దృష్టిసారించిన కేంద్రం తన ఆపరేషన్లను మరింత ముమ్మరం చేసింది. ఈ ఏడాదిలో అక్టోబర్ 5 నాటికి 202 మంది నక్సల్స్‌ను మట్టుబెట్టామని కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు 6 వేల మొబైల్ టవర్లు నిర్మించినట్లు వెల్లడించింది. సీఎంలతో మీటింగ్ ఇక సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అలాగే ఏపీ నుంచి హోంమంత్రి వంగలపుడి అనిత తదితరులు పాల్గొన్నారు. Also Read: టీడీపీలో చేరబోతున్నాం.. చంద్రబాబును కలిసిన తర్వాత BRS నేతల సంచలన ప్రకటన! ఇదిలాఉండగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో దంతేశ్వరి ఫైటర్స్.. మావోయిస్టల ఎన్‌కౌంటర్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(DRG)గా పిలిచే ఈ మహిళా కమెండోలు సాయుధ బలగాలకు బ్యాకప్‌గా కూడా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం నారాయణపూర్, దంతెవాడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 1200 మంది జవాన్లు పాల్గొన్నారు. వీళ్లలో దంతెవాడ జిల్లాకు చెందిన దంతేశ్వరీ ఫైటర్స్ కూడా ఉన్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కోసం దంతెవాడ జిల్లాలో 60 మంది మహిళా కమెండోలతో దంతేశ్వరి ఫైటర్స్‌ను ఏర్పాటు చేశారు. వీళ్లలో లొంగిపోయిన నక్సల్స్‌తో పాటుగా స్థానిక యువత కూడా ఉన్నారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ మహిళా కమెండోలు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్లు ముగిసిన తర్వాత మావోయిస్టుల మృతదేహాల తరలింపులో కూడా మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ ఇక ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 31 మంది మావోయిస్టుల్లో మరో ఏడుగురిని దంతెవాడ పోలీసులు ఆదివారం గుర్తించారు. వీళ్లు సుక్కు యాదవ్, విజయ్, సోహాన్, సుదర్ దౌడై, కొర్రమ్ సోనూ, జమ్లీగా గుర్తించారు. ఈ ఏడుగురు కూడా రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నవారే. శనివారం 16 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించిన పోలీసులు వాళ్లపై ఉన్న రివార్డులను కూడా బయటపెట్టారు. ఇప్పటిదాకా మొత్తం 23 మందిని గుర్తించగా.. మరో 8 మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. మావోయిస్టుల ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ఛత్తీస్‌గఢ్-అబూజ్‌మద్ అటవీ ప్రాంతంపై కూడా కేంద్రం ఫోకట్ పెట్టింది. బస్తర్‌లోని అబూజ్‌మద్ ప్రాంతం నక్సలైట్లకు అనుకూలమైన ప్రాంతం. అయితే ఇక్కడ ఆర్మీ బేస్ క్యాంపును కేంద్రం ప్రారంభించనుంది. బస్తర్‌లో 60 వేల మందికి పైగా వివిధ బలగాల సైనికులను మోహరిస్తున్నారు. వీటిలో కంకేర్‌లో SSB, BSF, ITBP.. అటు నారాయణపూర్‌లో ITBP, BSFతో పాటు కొండగావ్‌లో CRPF, STF, కోబ్రా దళాలను మోహరింపజేస్తున్నారు. ఇక దంతెవాడ, బీజాపూర్, సుక్మాలో మావోయిస్టుల పనిపట్టేందుకు పోలీసులు కాపు కాచుకోని కూర్చున్నారు. అంతేకాకుండా DRG, డిస్ట్రిక్ట్ ఫోర్స్, బస్తర్ ఫైటర్స్, బస్తారియా బెటాలియన్ కూడా అన్ని జిల్లాల్లో నక్సలైట్లపై ఇప్పటికే పోరాడుతున్నాయి. Also Read: పేదల జోలికి రావొద్దు.. కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ తగ్గుతున్న నక్సలిజం ప్రభావం ప్రస్తుతం నక్సలిజం చివరి పోరాటంలో ఉంది. భద్రతా దళాలపై ఎదురుదాడుల చేసే పరిస్థితిలో లేదు. 2024లో నక్సలైట్లపై భద్రతా బలగాలు పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే ఇప్పటికే వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గిపోయింది. ఒకప్పుడు నక్సలిజానికి కూడా చాలా క్రేజ్ ఉండేది. ప్రభుత్వాలు చేసే అన్యాయాలను ఎదిరించేందుకు అడవుల్లోకి వెళ్లి తుపాకి పట్టేవారు. కానీ ప్రస్తుతం అడవుల్లో ఉండేవారు కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే దశాబ్దాల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన వారు తప్ప కొత్తవాళ్లు ఎవరూ కూడా నక్సలైట్లలో చేరడం కూడా చాలావరకు తగ్గిపోయింది. Also Read: షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే? నక్సలైట్లను ఆర్థికపరంగా కట్టడి చేసి వాళ్లకు ఆయుధాలు అందకుండా కేంద్ర బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. ఇప్పుడున్న సాంకేతికత కారణంగా నక్సలైట్లు భద్రతా దళాలకు వెంటనే దొరికిపోతున్నారు. ఫలితంగా వారి తుపాకి తూటాలను బలైపోతున్నారు. ప్రస్తుతం నక్సల్స్‌పై యుద్ధం చివరిస్థాయికి వచ్చిందని మరికొన్ని నెలల్లోనే నక్సలిజంను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్రం గట్టి లక్ష్యంతో ఉంది. అయితే ఇది సాధ్యమవుతుందా లేదా తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. #telugu-news #national-news #maoists #naxalite మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి