/rtv/media/media_files/2025/12/08/central-govt-responds-on-telangana-airports-proposals-2025-12-08-21-08-28.jpg)
Central govt responds on telangana airports proposals
పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం భూమిని అప్పగిస్తేనే వరంగల్ విమానశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగూడెం,మహబూబ్నగర్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యం కాదని చెప్పింది. ప్రతిపాదిత స్థలాలు, విమానాశ్రయాలు నిర్మాణానికి అనుకూలంగా లేవని పేర్కొంది. నిజామాబాద్లో నిర్మాణం సాధ్యమైన కూడా పలు అవంతరాలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో వరంగల్ విమానశ్రయం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందినవని పేర్కొంది.
Also Read: ఆ యువతి వల్లే ఢిల్లీ ఉగ్ర కుట్ర బయటపడింది.. ఒమార్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఎయిర్పోర్టు అభివృద్ధికి 253 ఎకరాల స్థలం అవసరమని.. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించడంపైనే ఎయిర్పోర్టు అభివృద్ధి ఆధారపడి ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన స్థలాలు విమానాశ్రయాల నిర్మాణానికి అనుకూలంగా లేవని స్పష్టం చేసింది. పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్నగర్, నిజామాబాద్లో కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కోసం తెలగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది. పెద్దపల్లి మినహా మిగతా మూడు ఎయిర్పోర్టులకు సంబంధించి ఫ్రీ ఫిజిబిలటీ అధ్యయనం పూర్తయ్యింది. అయితే కొత్తగూడెం, మహబూబ్నగర్లో ఎయిర్పోర్టుల నిర్మాణం సాధ్యం కాదని అధ్యయనాలు తేల్చిచెప్పాయి.
నిజామాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి సాంకేతికంగా సాధ్యమైనప్పటికీ అనేక అవాంతరాలు తొలగించాల్సి ఉంది. అంతేకాదు రక్షణశాఖ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. రాజ్యసభలో తెలంగాణకు చెందిన ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహాలీ వివరించారు.
Follow Us