PMGKAY: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి జాబితానుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఆహార మంత్రిత్వ శాఖతో కలిసి ఐటీ విభాగం ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను వెల్లడించనుంది. దీని ఆధారంగానే ఏరివేత ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
5ఏళ్ల పాటు ఉచితంగా రేషన్..
ఈ మేరకు ట్యాక్స్ చెల్లించని వారికి పీఎంజీకేఏవై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి 5ఏళ్ల పాటు ఉచితంగా రేషన్ అందిస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1.97 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్‌లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కాగా ఇది టాక్స్ పేయర్లకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: Delhi Elections 2025: ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే.. ఢిల్లీలో బీజేపీదే అధికారం!
అనర్హుల ఏరివేతకు సిద్ధం..
భారీ సంఖ్యలో పౌరులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందులో అనర్హులు కూడా ఉన్నారు. దీంతో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమవగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తాజాగా ఓ ఆఫీసు ఆర్డర్‌ను జారీ చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం, ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని షేర్ చేసుకోనుంది. ఆధార్, పాన్, తదితర వివరాలను సమర్పిస్తే కనీస ఆదాయం వారికంటే ఎక్కువ ఉన్నవారి డేటాను డీజీఐటీ సిస్టమ్స్ గుర్తించనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.