/rtv/media/media_files/2025/02/18/Sqhtnf4sDF1V9YMlgMeo.jpg)
C E C appointment Photograph: (C E C appointment)
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా (India). అలాంటి దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే పెద్ద సవాలే. పదుల సంఖ్యలో పార్టీలు, 140 కోట్ల మంది ఓటర్లు. వీళ్లను బ్యాలెన్స్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. అందులో ముగ్గురే కమిషనర్లు మాత్రమే. వారే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు. వీళ్ల నియామకంలో ఎలాంటి పక్షపాతం ఉండకూదని భారత రాజ్యాంగం ప్రకారం ముగ్గురు సభ్యులతో ఓ సెలెక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ నియామక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి ఉంటారు.
కేంద్ర న్యాయ శాఖ ఐదుగురు సభ్యుల పేర్లను ఈ కమిటీకి సూచిస్తోంది. ప్రతిపక్ష నేత, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో ఉన్న సెలెక్షన్ ప్యానల్ ఇందులో ఒక పేరును ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఇందంతా ఒకప్పటి పద్దతి. కానీ 2024 నుంచి ఎన్నికల కమిషనర్లను నియమించే చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ సవరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇదే చట్టం ప్రకారం 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు , జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు.
Also Read: Supreme Court: ఆ మాటలు అసభ్యంగా లేవా..యూట్యూబర్ పై సుప్రీం కోర్టు సీరియస్!
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లేస్‌లో ప్రైమ్ మినిస్టర్ సూచించిన కేంద్ర మంత్రిని సెలక్షన్ కమిటీలోకి స్థానం కల్పించారు. ఇదే కొత్త చట్టంలో వచ్చిన మార్పు. 2023 డిసెంబర్‌లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 2025 ఫిబ్రవరి 18న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ విరమణ చెందారు. ఈయన స్థానంలో ఈసీ కొత్త చట్టం ప్రకారం ఫిబ్రవరి 17న ఎన్నికల కమిషనర్ సెలక్షన్ ప్యానల్ భేటీ అయ్యింది. అందులో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ఆయన సూచించిన కేంద్రం అమిత్ షాలు సమావేశం అయ్యారు. కేంద్ర న్యాయ శాఖ సెర్చ్ కమిటీ పంపిన ఐదుగురిలో జ్ఞానేష్ కుమార్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ (Gnanesh Kumar) ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు CECగా కొనసాగుతారు.
Also Read : యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
సుప్రీం కోర్టులో కేసు..
ఎన్నికల కమిషనర్ నియామకంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ను తప్పించడంపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. 2025 ఫిబ్రవరి 19న సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరగనుంది. మార్చి 2023లో జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, సిఇసి, ఇసిల నియామకాలను పరిశీలిస్తూ, నియామకం కేవలం కార్యనిర్వాహకుల సలహా మేరకు జరగకూడదని, ఈ ప్రక్రియ స్వతంత్రంగా ఉండాలని పేర్కొంది. ప్రధానమంత్రి, లోక్‌సభ ఎల్ఓపీ, సీజేఐలతో కూడిన సెలక్షన్ కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి సీఈసీలు, ఈసీలను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read: Maha kumbha Mela 2025: మహా కుంభమేళా భక్తులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ పొడగింపు?
ప్రతిపక్షాల ఆరోపణలు
కేంద్రం ఎన్నికల కమిషనర్ల నియామకంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నియామక ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ‘సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ నియామక అర్థరాత్రి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. సీఈసీ నియామక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రాతినిథ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ నియామకం చేపట్టింది. పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. కేంద్రం సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించిన రాహుల్ గాంధీ మండిపడ్డారు.
జ్ఞానేశ్ కుమార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సన్నిహితుడని ఆరోపణలు ఉన్నాయి. జ్ఙానేశ్ కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్. ఆర్టికల్ 370 రద్దులో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు.హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా 2024 జనవరి 31న రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు.
During the meeting of the committee to select the next Election Commissioner, I presented a dissent note to the PM and HM, that stated: The most fundamental aspect of an independent Election Commission free from executive interference is the process of choosing the Election… pic.twitter.com/JeL9WSfq3X
— Rahul Gandhi (@RahulGandhi) February 18, 2025
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై బుధవారం(ఫిబ్రవరి)19 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో కనిపిస్తోంది.
ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్,ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు బలపడతాయి’అని కేసీ వేణుగోపాల్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
VIDEO | On the appointment of new CEC, Congress leader KC Venugopal (@kcvenugopalmp) says, "The LoP already raised this genuine concern in the selection committee meeting yesterday. A judicial process is going on in the election commission issue in the SC. The LoP stand was to… pic.twitter.com/7iob0g5xAx
— Press Trust of India (@PTI_News) February 18, 2025
Also Read : ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?