/rtv/media/media_files/2025/03/09/c37uNxXe2FjXKvVMCnhU.jpg)
Actoress Ranya Rao
కర్ణాటక నటి రన్యరావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈమె విమానాశ్రయంలో పట్టుబడిన దగ్గర నుంచి ఈమె కేసులో రోజుకో న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు రన్యారావు కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళింది. ఈమెపై నిన్న సీబీఐ కేసు నమోదు చేసింది. వీరు త్వరలోనే రన్యారావును విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ల్యాప్ ట్యాప్, ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోర్సెనిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారుల కస్టడీలోనే ఉన్న రన్యారావును.. అక్కడి విచారణ అనంతరం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రన్యారావు కాల్ డేటాలో ఉన్న నంబర్ల ప్రకారం ఢిల్లీ, ముంబయ్ లోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నటి, రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డీజీపీ రామచంద్రరావు కూతురు అయిన రన్యాను మార్చి 7 నుంచి 11 వరకు డీఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అంగీకరించిందని, ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉన్నట్లు రన్యా బయటపెట్టినట్లు సమాచారం. ఇదంతా కూడా అతనికోసమే చేసినట్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు..
ఈ మేరకు రన్యా బ్యాంక్ చెల్లింపులపై ఫోకస్ పెట్టిన అధికారులు ఆ రాజకీయ నేత ఎవరనేదానిపై ఆరాతీస్తున్నారు. యూఏఈ నుంచి రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ మాత్రమే కాదు యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా ఆమె బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. 2024లోనే ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని, ఇటీవలే కేవలం 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రతి ట్రిప్‌లో కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారించారు. స్మగ్లింగ్ చేసినందుకు ఒక ట్రిప్ కు రూ.12 లక్షలు తీసుకుంటుందని తెలిపారు.
Also Read: Syria: రెండు రోజుల్లో ఏకంగా 600మంది..సిరియాలో దాడులు