/rtv/media/media_files/2025/02/25/wOx6L45QmynB6NbNKvOD.jpg)
panjab donkey route Photograph: (panjab donkey route)
అమెరికాలోకి ప్రవేశించిన భారతీయ అక్రమవలదారుల్లో పంజాబ్ రాష్ట్రం వారే ఎక్కువగా ఉన్నారు. డాంకీ రూట్ ద్వారా అమెరికాకు పంపే ట్రావెల్ ఏజెంట్లపై పంజాబ్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. పంజాబ్ పోలీసులు అమృత్‌సర్, జలంధర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో దాడులు చేశారు. పంజాబ్‌కు చెందిన 131 అమెరికా నుంచి బహిష్కరణకు గురైయ్యారు. వారిలో 17 మంది ట్రావెల్ ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పంజాబ్ పోలీసులు ట్రావెల్ ఏజెంట్లపై కేసులు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గుర్ని అరెస్ట్ కూడా చేశారు.
AIso Read : Internet shutdown: ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించడంలో భారత్ రెండో ర్యాంక్
వీరు అమెరికా వెళ్లాలనుకున్న వారిని డబ్బులు తీసుకొని దొడ్డిదారిన (డాంకీ రూట్)లో తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలు భారీ దాడులు నిర్వహిస్తున్నాయి. జలంధర్ డిప్యూటీ కమిషనర్ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోని 271 ట్రావెల్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Punjab: పంజాబ్‌లో త్వరలో ఆప్ ప్రభుత్వం కూలిపోతుంది: కాంగ్రెస్ నేత
ట్రావెల్ ఏజెంట్లు, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ల కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను పరిశీలించాలని SDMని ఆదేశించారు. ట్రావెల్ ఏజెంట్లపై ఏదైనా ఫిర్యాదు అందితే వెంటనే డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని జిల్లా పోలీసులను కోరారు. అనధికార ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పంజాబ్ పోలీసులు.