/rtv/media/media_files/2025/03/06/XqKQ9PyNlgEbN6rvg00Z.jpg)
Case against Bengal minister, his driver in Jadavpur University clashes
Jadavpur University: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పుర్ యూనివర్సిటీలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భ్రత్య బసుపై కేసు నమోదైంది. ఇటీవల ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో ఇద్దరు విద్యా్ర్థులు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మంత్రిపై కేసు నమోదు చేశారు.
యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను రక్షించడంలో విఫలమైందని విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేశాయి. దీంతో మంత్రి భ్రత్య బసు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి కాన్వాయ్‌ను కూడా ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన సీపీఐ (M) విద్యార్థి సంఘం చుట్టుముట్టింది.
Also Read: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం !
మంత్రికి స్వల్ప గాయాలు
కాన్వాయ్ ముందుకు వెళ్లడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థులు మంత్రి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. మంత్రికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన విద్యార్థుల్లో ఒకరు మంత్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మంత్రితో పాటు కాన్వాయ్ డ్రైవర్, టీఎంసీ నేత ఓం ప్రకాశ్ మిశ్రా, అలాగే ఓ ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది.
ఇదిలాఉండగా.. యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ నిరసనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇది హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం కార్యాలయానికి కూడా పలువురు నిప్పంటితారు. దీంతో వర్సిటీలో పరిస్థితులు అదుపుతప్పాయి.
Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు
విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం కార్యాలయాన్ని వారు ముట్టడించి నిప్పంటించారు. దీంతో యూనివర్సిటీలో పరిస్థితులు అదుపుతప్పాయి.