Central: కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే వారం ఇది పార్లమెంటు ముందుకు రానుంది.  దాని తర్వాత పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీకి పంపిస్తారని తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
tax

Incom Tax Calculater

ప్రస్తుతం అమలులో ఉన్న ఎప్పటిదో ఆదాయపు పన్ను చట్టం స్థానంలో  కొత్త చట్టాన్ని తీసుకువస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లుకు ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. వచ్చే వారం పార్లమెంటు ముందు ఈ బిల్లు రానుంది. దాని తరువాత దీన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నారు.

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు

సులభంగా, అందరికీ అర్థం అయ్యేలా..

ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం..1961లో  ఆరు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టింది. ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్‌ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ పన్ను, గిఫ్ట్‌ అండ్‌ వెల్త్‌ ట్యాక్స్ ఇలా అన్నీ కలిపి 298 సెక్షన్లు, 23 అధ్యాయాలున్నాయి ఇందులో. అయితే దీన్ని మార్చాని ప్రభుత్వం భావిస్తోంది. ధీని స్థానంలో సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకొనేలా కొత్త ఆదాయప పన్ను చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచన. దీని కోసం సీబీడీటీ (CBDT) అంతర్గతంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాలు, సలహాలను ఆహ్వానించింది. మొత్తంగా ఆదాయపు పన్ను శాఖకు 6,500 సూచనలు అందగా.. వీటిని పరిగణలోకి తీసుకొని కొత్త బిల్లును రూపొందించింది. దీనికి సంబంధించి కన్ని రోజుల క్రితం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ప్రకటన కూడా చేశారు. ఈరోజు దీనికే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. పార్లమెంట్ లో కూడా ఇది పాస్ అయిపోతే...కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చేస్తుంది. 

Also Read:  OU: ఉస్మానియాలో ఉద్రిక్తత...విద్యార్ధుల ఆందోళన

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

 

 

Advertisment
Advertisment
Advertisment