రాబోయే పదేళ్లలో వంద ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి కింజరాపు కీలక ప్రకటన

రాబోయే పదేళ్లలో వంద కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

New Update
Cabinet approves modified UDAN scheme to develop 100 airports at cost of over 28,000 crore in next 10 years

Cabinet approves modified UDAN scheme to develop 100 airports at cost of over 28,000 crore in next 10 years

రాబోయే పదేళ్లలో వంద కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఉడాన్ యాత్రీ కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బుధవారం మొదటిసారిగా రాంచీకి వచ్చిన కేంద్రమంత్రి.. స్థానిక ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యం కోసం పలు కార్యక్రమాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సవరించిన పౌర విమానయాన శాఖ ప్రాంతీయ అనుసంధాన పథకం ప్రకారం రూ.29 కోట్లతో ఉడాన్-2 త్వరలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.  

Also Read: ప్రమాదాల వెనుక కుట్ర కోణం...రైల్వేశాఖ సంచలన విషయాలు!

రాంచీ ఎయిర్‌పోర్టులో యాత్రీ ఉడాన్‌ కేఫ్‌తోపాటు ఫ్లైబ్రరీని కేంద్రమంత్రి ప్రారంభించారు. ఇది విమానాల కోసం వేచి చూసే ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన గ్రంథాలయం. ఇక్కడ ఓ పుస్తకాన్ని తీసుకొని చదివే ప్రయాణికుడు మరో ఎయిర్‌పోర్టును దాన్ని వెనక్కి ఇవ్వొచ్చు. మరోవైపు పశ్చిమాసియాలో సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలైన ఎదుర్కొనేందుకు ప్రజలు రెడీగా ఉండాలని తెలిపారు. విమాన రంగానికి సపోర్ట్‌గా కేంద్రం..  ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) ధరలతోపాటు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు తగ్గించినట్లు పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు