/rtv/media/media_files/2026/02/19/up-constable-2026-02-19-21-33-24.jpg)
Bride-to-be UP constable's 'abduction' turns out as elopement with murder accused
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ లేడి కానిస్టేబులు తన పెళ్లికి ఒకరోజు ముందు ఓ క్రిమినల్‌తో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కంగుతిన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. లేడి కానిస్టేబులు సంధ్యా భరద్వాజ్(25) అలీగఢ్‌లోని సైబర్ క్రైమ్ సెల్‌లో పనిచేస్తోంది. అయితే ముజఫర్ నగర్‌లో విధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్ అతుల్ శర్మతో ఆమెకు వివాహ సంబంధం కుదిరింది. ఫిబ్రవరి 8న అతడితో పెళ్లి జరగాల్సి ఉంది.
Also read: తెలుగు రాష్ట్రాలకు BIG అలర్ట్.. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న సర్.. కోట్లల్లో ఓటర్లు మాయం!
కాని ఫిబ్రవరి 7న సంధ్యా కనిపించలేదు. ఓ హత్య కేసులో అరెస్టు అయ్యి బెయిల్‌పై రిలీజ్ అయిన రౌడీ షీటర్ అంకిత్ చౌహన్‌తో కలిసి వెళ్లిపోయింది. అయితే తమ కూతురును బెదిరించి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్లకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం
అయితే విచారణలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హత్య కేసు నిందితుడు అంకిత్, లేడి కానిస్టేబుల్ సంధ్యా ప్రియుడని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు షాకైపోయారు. వాళ్లి్ద్దరి మధ్య రిలేషన్ ఉండటంతోనే ఆమె అతడితో పారిపోయినట్లు గుర్తించారు. చివరికి సంధ్యా ఆచూకిని గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించారు. తన ఇష్టప్రకారమే అంకిత్‌తో వెళ్లిపోయినట్లు సంధ్యా పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఆమెను తన కుటుంబానికి అప్పగించారు. దీంతో ఆమె పెళ్లి రద్దయ్యింది. ఇక అంకిత్ చౌహన్ కూడా ఫిబ్రవరి 10న జిల్లా కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు.
Follow Us