Bomb Threats: రజినీకాంత్‌, ధనుష్‌ ఇళ్లలో బాంబులు..

తమిళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Bomb Threats To Actor Rajini Dhanush Residences Turns Out To Be Hoax

Bomb Threats To Actor Rajini Dhanush Residences Turns Out To Be Hoax

తమిళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటులు రజనీకాంత్(rajinikanth), ధనుష్(dhanush) ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో పోయెస్ గార్డెన్‌లోని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో, అల్వార్‌పేటలో ఉన్న హీరో ధనుష్ నివాసంలో బాంబులు(bomb-threats) పెట్టినట్లు చెప్పారు. అవి ఏ క్షణమైనా పేలొచ్చని ఆ మెయిల్‌లో హెచ్చరించారు. 

Also read: పార్లమెంట్ ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ ముచ్చట్లు.. వీడియో వైరల్

Bomb Threats To Actor Rajini Dhanush Residences

దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి రంగంలోకి దిగారు. ఇద్దరు నటుల ఇంటికి చేరుకున్న భద్రతాదళాలు సుమారు గంటన్నరపాటు క్షుణ్ణంగా సోదాలు చేశాయి. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం, పరిసరాల్లో మొత్తం గాలించారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువు కానీ దొరకలేదు. దీంతో అది ‘ఫేక్ మెయిల్’ అని అధికారులు నిర్ధారించారు. కేవలం భయాందోళనలు రేపేందుకే కొందరు ఆకతాయిలు కావాలనే ఈ పనికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: నడిరోడ్డుపై లాయర్‌ దారుణ హత్య.. ఆ తర్వాత బైక్‌ మొరాయించడంతో?

గతంలో కూడా హిరో విజయ్, అజిత్ లాంటి ప్రముఖుల ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇప్పుడు మాత్రం ఏకంగా డీజీపీ కార్యాలయానికే మెయిల్‌ను పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆ మెయిల్ పంపిన వ్యక్తి ఎవరు..? ఏ ఐపీ అడ్రస్ ద్వారా పంపించారనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను, పోలీసులను ఇబ్బందులకు గురిచేసే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా రజనీకాంత్, ధనుష్ ఇళ్ల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.    

Advertisment
తాజా కథనాలు