/rtv/media/media_files/2025/04/07/uXvLOmnKKZZadlSezXUG.jpg)
BJP tops list of national parties in Donations
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) కీలక విషయాన్ని వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు తమ నివేదికలో తెలిపింది. ఈ పార్టీకి మొత్తం రూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.
Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట
ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.2,544.28 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 12,547 కోట్లుగా ఉంది. ఈ ఏడాది వచ్చిన మొత్తం విరాళాల్లో ఒక్క బీజేపీయే 88 శాతం వాటా దక్కించుకుంది. ఈ విరాళాల్లో 211 శాతం పెరుగుద కనిపించింది. బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నిలిచింది.
Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువగా విరాళాలు వచ్చాయి. తమకు రూ.20 వేలకు మించి విరాళాలు రాలేదని బీఎస్పీ మరోసారి చెప్పింది. 2022-2023 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2023-24లో జాతీయ పార్టీలకు 199 శాతం పెరిగింది. 2023-24లో జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 88 శాతం బీజేపీ ఖాతాలోకే చేరాయి.
Also Read: రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....
Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!
rtv-news | bjp | congress | party-funds